AFG vs SA : ప్రపంచ క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలవ్వనుంది. అఫ్గనిస్థాన్(Afghanistan), దక్షిణాఫ్రికా (South Africa) జట్ల మధ్య మధ్య తొలిసారి ద్వైపాక్షిక సిరీస్ జరుగనుంది. ఇరుజట్ల మధ్య జరుగబోయే మూడు వన్డేల సిరీస్(ODI Series)కు అఫ్గనిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. ఈ విషయాన్ని బుధవారం ఇరుదేశాల క్రికెట్ బోర్డులు అధికారికంగా వెల్లడించాయి.
అయితే.. ట్విస్ట్ ఏంటంటే ఈ మ్యాచ్‌లన్నీ తటస్థ వేదికపై నిర్వహించనున్నారు. అవును.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని షార్జా వేదికగా అఫ్గన్, సఫారీ జట్లు తలపడనున్నాయి. అఫ్గనిస్థాన్, దక్షిణాఫ్రికాలు షార్జాలో సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీల మధ్య వన్డే సిరీస్ ఆడనున్నాయి.
🚨 ANNOUNCEMENT 🚨
We are hosting the @ProteasMenCSA for the first time in a three-match ODI series. 🇿🇦
📅: September 18 – 22
🏟: Sharjah Cricket Stadium, UAE🔗: https://t.co/GeSqbfWjj2#AfghanAtalan | #AFGvSA pic.twitter.com/2MaQvx9d0w
— Afghanistan Cricket Board (@ACBofficials) July 31, 2024
తొలి వన్డే 18వ తేదీ బుధవారం, రెండో మ్యాచ్ 20న, ఆఖరిదైన మూడో వన్డే సెప్టెంబర్ 22వ తేదీన జరుగుతాయి. అయితే.. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాపై కాబూలీ జట్టు గెలిచింది లేదు. తాజాగా టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లోనూ ఎడెన్ మర్క్రమ్ సేన రషీద్ ఖాన్ సారథ్యంలోని అఫ్గనిస్థాన్ ఫైనల్ కలను కల్లలు చేసింది. దాంతో, ఈసారి సఫారీలపై ఆ ఓటముల రికార్డుకు బ్రేక్ వేయాలని అఫ్గన్ జట్టు భావిస్తోంది.