Paris Olympics 2024 : మాజీ వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించాడు. విశ్వ క్రీడల్లో నాలుగు పర్యాయాలు క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన తొలి ఆటగాడిగా జకో రికార్డు నెలకొల్పాడు. పారిస్ ఒలింపిక్స్ రెండో రౌండ్లో రఫెల్ నాదల్(Rafael Nadal)ను ఓడించిన జకోవిచ్.. మూడో రౌండ్లో డొమ్నిక్ కోఫెర్(Dominik Koepfer)ను చిత్తు చేశాడు.
దాంతో, రికార్డు స్థాయిలో నాలుగోసారి జకోవిచ్ ఒలింపిక్స్ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. సెమీస్ బెర్తు కోసం అతడు గ్రీస్‌కు చెందిన సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచిన జకోవిచ్ పారిస్ ఒలింపిక్స్‌లో దుమ్మురేపుతున్నాడు. రెండో రౌండ్లోనే చిరకాల ప్రత్యర్థి నాదల్‌పై పైచేయి సాధించిన సెర్బియా స్టార్ మూడో రౌండ్లో రెచ్చిపోయాడు. జర్మనీ కెరటం డోమ్నిక్పై 7-5, 6-3తో గెలుపొంది క్వార్టర్స్‌లో ప్రవేశించాడు.
Hunting for the 🥇@DjokerNole records a 7-5 6-3 victory over Koepfer to reach the quarter-finals!@Olympics | #Paris2024 | #Tennis pic.twitter.com/gtFztGqoTj
— ATP Tour (@atptour) July 31, 2024
మొత్తంగా ఒలింపిక్స్‌లో అతడికిది 16వ విజయం. 2008 బీజింగ్ విశ్వ క్రీడల్లో కాంస్యంతో సరిపెట్టుకున్న జకోవిచ్ ఆ తర్వాత వరుసగా విఫలమయ్యాడు. అయితే.. నిరుడు నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో రికార్డు సాధించిన జకో ఈసారి గోల్డ్ మెడల్ లక్ష్యంగా పెట్రేగిపోతున్నాడు. మరోవైపు ఇటలీ సంచలనం లొరెంజో ముసెట్టి (Lorenzo Musetti) సైతం నాకౌట్‌కు అర్హత సాధించాడు. అమెరికాకు చెందిన టేలర్ ఫ్రిట్జ్‌పై అద్భుత విజయంతో లొరెంజో ఒలింపిక్స్ క్వార్టర్స్ బెర్తు సాధించాడు.