Wayanad Tragedy : వయనాద్ విషాదం దేశాన్ని విస్మయపరిచిందని ఈ వ్యవహారంపై రాజకీయాలు తగవని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అన్నారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వయనాడ్ ఉదంతంపై మాట్లాడిన తీరు సరైంది కాదని చెప్పారు. పాలక పక్ష సభ్యుడి ప్రసంగం విచారకరమని పేర్కొన్నారు. ఇది యావత్ దేశానికి, కేరళకు అత్యంత విషాద ఘటన అయినందున తేజస్వి సూర్యను హోంమంత్రి అమిత్ షా వారించాల్సిందని అన్నారు.
ఈ ఘటనపై మనం అప్రమత్తం కావాలని, దీనిపై చర్యలు అవసరం, సరైన ఫలితాలు రాబట్టడం అవసరమని చెప్పారు. మనం కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని, కానీ మనమంతా ఐక్యంగా ఉన్నామని దేశానికి చాటాల్సిన సందర్భం ఇదని వేణుగోపాల్ పేర్కొన్నారు. కాగా, కేరళలో (Kerala) వయనాడ్ (Wayanad)లో మృత్యుఘోష కొనసాగుతోంది. కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ అందిన తాజా సమాచారం ప్రకారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో 163 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
అందులో 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తైంది. 32 మృతదేహాలను అధికారులు బాధిత కుటుంబాలకు అందజేశారు. సుమారు 78 మృతదేహాలను మెప్పాడి సోషల్ హెల్త్ సెంటర్లో పెట్టారు. మరో 32 మంది మృతదేహాలను నీలంబుర్ జిల్లా ఆస్పత్రిలో ఉంచారు. ఇక ఈ ఘటనలో 91 మంది మిస్సింగ్ కాగా, 191 మంది ఆస్పత్రి పాలయ్యారు. వయనాడ్లో విపత్తు నిర్వహణ బృందాలు, సైనికులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
Read More :