Manushi Chhillar | మాజీ సీఎం మనవడితో బాలీవుడ్ నటి డేటింగ్.?
Manushi Chhillar - Veer Pahariya | మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాను ప్రేమించే అబ్బాయి ఎవరో కాదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియా అని సమాచారం.
Manushi Chhillar – Veer Pahariya | మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే తాను ప్రేమించే అబ్బాయి ఎవరో కాదు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియా అని సమాచారం. జూలై 12న అనంత్ అంబానీ – రాధిక మర్చెంట్ల వెడ్డింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి సంబంధించిన ఈవెంట్లో వీళ్లిద్దరూ కలిసి ఉండడం.. కలిసి డ్యాన్స్ చేయడం చూస్తుంటే ఇద్దరు ప్రేమలో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ ఓర్రీ కూడా ఒక వ్లాగ్ చేయగా.. ఈ వీడియోలో మానుషి చిల్లర్ – వీర్ పహారియా కలిసి ఉండడం వీర్ భుజంపై తల పెట్టుకొని మానుషి చిల్లర్ సేదతీరుతూ కనిపించడం చూస్తే ఈ వార్తలు నిజం అని తెలుస్తుంది. మరోవైపు ఇదే వ్లాగ్‌లో జాన్వీ కపూర్ ఆమె బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియా కలిసి తిరగడం చూడవచ్చు.
హరియాణాకు చెందిన మానుషి చిల్లర్ 2017లో ప్రపంచ సుందరిగా విజయం సాధించింది. అయితే విశ్వసుందరి అయిన సినిమా అవకాశాలు వరుసగా ఏం రాలేదు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. అనంతరం తారిఖ్, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, బడేమియా ఛోటే మియా వంటి సినిమాలు చేసింది. ఇక తెలుగులో వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్లో హీరోయిన్గా మెరిసింది.
Also read..
Condom | కండోమ్‌తో జాగ్రత్త.. వంధ్యత్వం, క్యాన్సర్ రావొచ్చు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

