BRS Party | బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం నీచమైన వ్యాఖ్యలు.. రేవంత్ దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్
BRS Party | బీఆర్ఎస్ సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై సీఎం చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అసెంబ్లీ సాక్షిగా తనస్థాయి మరిచి సీఎం చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కోరారు.
BRS Party | బీఆర్ఎస్ సీనియర్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై సీఎం చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా దిష్టిబొమ్మల దహనానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావని.. ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ.. జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తనస్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు కోరారు.
సుదీర్ఘకాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో, అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళ సభ్యులపై, అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరి మనసులను నొప్పించాయని.. జీవితంలో ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్క మహిళకు, ఆడబిడ్డకు ఈ వ్యాఖ్యలు అవమానకరమని కేటీఆర్ అన్నారు. అధికారం, అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉన్నదన్న కేటీఆర్.. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఆయన దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయాలని కేటీఆర్ కోరారు.
Read Also :
-
KTR | కండకావరంతో ఆడబిడ్డలను అవమానించారు.. సీఎంపై కేటీఆర్ మండిపాటు..
-
Sabitha Indra Reddy | సీఎం రేవంత్ నోటికొచ్చింది మాట్లాడుతున్నడు.. సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

