అమరావతి : ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం రాష్ట్రంలో పనిచేస్తున్న 96 మంది డీఎస్పీ అధికారులను(DSPs) బదిలీ చేసింది. నిన్న, మొన్నటి వరకు ఐఏఎస్(IAS) , ఐపీఎస్(IPS) అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం బుధవారం 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ(DGP) ద్వారకా తిరుమలరావు (Dwaraka Tirumal Rao) ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో 57 మంది డీఎస్పీలను హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బదిలీ అయినవారిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సీఐడీ , ఇతర విభాగాల అధికారులు ఉన్నారు.