IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక ఛేదనతో రికార్డు నెలకొల్పిన సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డారు. వాంఖడేలో ముంబై ఇండియన్స్ బౌలర్ల ధాటికి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. అభిషేక్ శర్మ(40) మెరుపు ఆరంభాన్ని ఇవ్వడంతో మరోసారి భారీ స్కోర్ ఖాయం అనిపించింది. కానీ, పవర్ ప్లే తర్వాత ముంబై బౌలర్లు అనూహ్యాంగా పుంజుకొని.. వరుసగా వికెట్లు తీశారు. స్లో పిచ్ మీద పెద్ద షాట్లు ఆడలేకపోయారు. అయితే.. హెన్రిచ్ క్లాసెన్(37) ఆఖర్లో అనికేత్ వర్మ (18నాటౌట్) మెరుపులతో 160 దాటించారు. ఆఖరి మూడు ఓవర్లలో 47 రన్స్ రావడంతో హైదరాబాద్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.
టాస్ ఓడిన హైదరాబాద్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. ముంబై పేసర్లను దీటుగా ఎదుర్కొన్న అభిషేక్ శర్మ(40), ట్రావిస్ హెడ్(28)లు స్కోర్ బోర్డును ఉరికించారు. పవర్ ప్లేలో బుమ్రా, చాహర్, పాండ్యా.. ఎంత ప్రయత్నించినా వికెట్ మాత్రం దక్కలేదు. అయితే.. 7వ ఓవర్లో హైదరాబాద్‌ను హార్దిక్ పాండ్యా దెబ్బకొట్టాడు. జోరుమీదున్న అభిషేక్‌ను వెనక్కి పంపాడు. దాంతో, 58 వద్ద తొలి వికెట్ పడింది. ఆ కాసేపటికే విల్ జాక్స్ బౌలింగ్‌లో ఫ్రంట్ ఫుట్ వచ్చిన ఇషాన్ కిషన్(2) స్టంపౌట్ అయ్యాడు. దాంతో, 9 పరుగుల తేడాతో 2 వికెట్లు కోల్పోయింది హైదరాబాద్. నిదానంగా ఆడిన హెడ్ సైతం జాక్స్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి(19, హెన్రిచ్ క్లాసెన్(30) కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
Middled those and how 🔥pic.twitter.com/2v6zBBRSug
— SunRisers Hyderabad (@SunRisers) April 17, 2025
బుమ్రా, బౌల్ట్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. బంతి బ్యాట్ మీదకు రాకపోవడంతో.. పరుగులు రావడం కష్టమైంది. బౌల్ట వేసిన 17వ ఓవర్లో నితీశ్ యార్కర్‌ను ఆడి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం అనికేత్ వర్మ(18 నాటౌట్) చెలరేగి ఆడాడు. చాహర్ బౌలింగ్‌లో ఈ కుర్ర హిట్టర్ వరుసగా 6, 4, 4, 6 బాదడంతో స్కోర్ 130 దాటింది. కానీ, బుమ్రా తనతొలి బంతికే క్లాసెన్‌ను బౌల్డ్ చేసి ఐదో వికెట్ అందించాడు. దాంతో.. సన్‌రైజర్స్ స్కోర్ 150లోపే పరిమితం అవుతుందనిపించింది. కానీ, పాండ్యా వేసిన 20 ఓవర్లో అనికేత్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టాడు. ఆఖరి బంతిని కెప్టెన్ కమిన్స్(8 నాటౌట్) లెగ్ సైడ్ పడిన బంతిని స్టాండ్స్‌లోకి పంపాడు. దాంతో, హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది.
Work left with the ball 💪#PlayWithFire | #MIvSRH | #TATAIPL2025 pic.twitter.com/sJABWzvBIm
— SunRisers Hyderabad (@SunRisers) April 17, 2025