Sonakshi Sinha | బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకొని జీవితాన్ని గడుపుతున్నది. జహీర్ ఇక్బాల్‌ను ప్రేమించి కుటుంబీకులను ఒప్పించి పెళ్లి చేసుకుంది. అయితే, వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియా వేదికగా పలువురు ట్రోల్ చేస్తూ వస్తుంటారు. అయితే, సోనాక్షి ఇవేమీ పట్టించుకోకుండా తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తుంది. పలువురు నెటిజన్స్ కొందరు దారుణంగా కామెంట్స్ చేస్తు వస్తున్నారు. ఈ జంట విడిపోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సోనాక్షి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చేసినా.. విడాకులు, ఎప్పుడు విడిపోతున్నారు? అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తొలిసారిగా సోనాక్షి స్పందిస్తూ.. విడాకులు ఎప్పుడంటూ ప్రశ్నించే వారికి ఘాటుగానే సమాధానం చెప్పింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోనాక్షి ఇటీవల భర్తతో కలిసి ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఓ నెటిజన్ ‘మీరు విడాకులకు దగ్గరలో ఉన్నారు’ అంటూ కామెంట్ చేశాడు. ఇది చూసి సహనం కోల్పోయిన సోనాక్షి.. సదరు వ్యక్తికి గడ్డి పెట్టింది. ‘అవునా ముందు మీ అమ్మానాన్న విడాకులు పూర్తి కానీ.. తర్వాత కచ్చితంగా తాము తీసుకుంటాం. ప్రామిస్ అంటూ’ ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం సోనాక్షి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నది. సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ వివాహం తర్వాత ఈ జంటను ట్రోల్స్ చేశారు. సోనాక్షి సిన్హాపై వస్తున్న ట్రోల్స్‌పై ఆమె తండ్రి శత్రుఘ్న సిన్హా ఇటీవల స్పందించారు.
తన కూతురు చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఏమీ చేయలేదన్నారు. పెళ్లి అనేది ద్దరు వ్యక్తుల నిర్ణయమని.. దీనిపై మాట్లాడేందుకు ఎవరికీ హక్కు లేదన్నారు. పనీపాటా లేక ఖాళీగా తిరుగుతున్న అందరికీ ఇదొక్కటే పనుందని.. వాళ్లను విమర్శించేవాళ్లకు నేనొక్కటే చెప్పదల్చుకున్నా.. వెళ్లి మీ పని చూసుకోండి.. మీ జీవితాన్ని ముందు చక్కదిద్దుకోండి అంటూ హితవు పలికారు. సోనాక్షి, జహీర్ ఇక్బాల్ దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకున్నారు. 2024 జూన్ 23న పెళ్లి చేసుకున్నారు. సోనాక్షి సినిమాల విషయానికి వస్తే.. చివరిసారిగా 2024లో బడే మియాన్ చొటే మియాన్’లో కనిపించింది. అలాగే, హీరామండి వెబ్‌సిరీస్‌లోనూ నటించింది. ఇక తెలుగులో తొలిసారిగా ‘జటాధర’ మూవీలో కనిపించనున్నది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్లో సోనాక్షి బిజీగా ఉన్నది.