Lorry Drivers | ఆందోల్, ఏప్రిల్ 17: పరిశ్రమ యాజమాన్యం ఈ నెల 12 నుండి తమ లారీలు లోడింగ్ నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హైదరాబాద్ లారీ అసోసియేషన్ ఓనర్స్ కమ్ డ్రైవర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇవాళ సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట చార్మినార్ బ్రూవరీస్ బీర్ పరిశ్రమ ఎదుట హైదరాబాద్ లారీ అసోసియేషన్ ఓనర్స్ కమ్ డ్రైవర్స్ ఆందోళన చేపట్టారు.
హైదరాబాద్ లారీలను లోడింగ్‌కు అనుమతించకుండా పరిశ్రమ యాజమాన్యం అర్థాంతరంగా తెలంగాణలోని 18 డిపోలలో లోడింగ్ నిలిపివేసిందని.. గత కొన్నేళ్లుగా బీర్ పరిశ్రమలో లోడింగ్ సేవలందించిన మమ్మల్ని తొలగిస్తే మేము మా కుటుంబాలు ఎక్కడికి వెళ్లాలని వారు ఆవేదన చెందారు.
ఇప్పటికైనా చార్మినార్ బ్రూవరీస్ పరిశ్రమ యాజమాన్యం స్పందించి లోకల్ లారీలతో కలిపి హైదరాబాద్ లారీలను లోడింగ్‌కు అనుమతించాలని ఓనర్స్ అండ్ డ్రైవర్స్ డిమాండ్ చేశారు. లేదంటే కుటుంబాలతో కలిసి పరిశ్రమ ఎదుట ఆందోళన చేస్తామని వారు తెలిపారు. లారీలను తొలగించడంతో 100 కుటుంబాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత