India A Squad : జూన్‌లో ఇంగ్లండ్ పర్యటన(England Tour)ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న సెలెక్టర్లు స్క్వాడ్ ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. అంతకంటే ముందు భారత ‘ఏ’ జట్టు ఇంగ్లండ్ వెళ్లనుంది. శుక్రవారం స్క్వాడ్‌ను ప్రకటించింది బీసీసీఐ. ‘ఇంగ్లండ్ లయన్స్’ జట్టుతో జరుగబోయే ఈ సిరీస్‌కు రంజీ హీరో అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran) సారథిగా 18 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.
ఓపెనర్ యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్‌లతో పాటు నిరుడు ఇంగ్లండ్ మీద అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌కు స్క్వాడ్‌లో చోటు దక్కింది. శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లను ప్లే ఆఫ్స్ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఊహించినట్టుగానే దేశవాళీలో పరుగుల వరదపారించిన కరుణ్ నాయర్ (Karun Nair) ఏ జట్టుకు ఎంపికయ్యాడు.
BCCI announce a strong squad for the upcoming India A tour of England, which precedes the upcoming five-match Test series 🇮🇳 pic.twitter.com/fM1lFcKA9d
— ESPNcricinfo (@ESPNcricinfo) May 16, 2025
సీనియర్ జట్టులో ఆడనున్న సర్పరాజ్ ఖాన్, మెల్బోర్న్లో సెంచరీ బాదిన నితీశ్ కుమార్ రెడ్డి.. లార్డ్స్ శార్దూల్‌ను అక్కడి పరిస్థితులకు అలవడతారనే ఉద్దేశంతో ఏ జట్టులోకి తీసుకున్నారు సెలెక్టర్లు. ఈమధ్యే సెంట్రల్ కాంట్రాక్ట్ సాధించిన ఇషాన్ కిషన్ రెండో వికెట్ కీపర్‌గా స్క్వాడ్‌లోకి వచ్చాడు. హర్షిత్ రానా, అన్షుల్ కంబోజ్, తుషార్ దేశ్‌పాండేలతో కూడిన పేస్ బౌలింగ్‌కు అనుభవజ్ఞుడైన ఖలీల్ అహ్మద్‌ను నాయకత్వం వహించనున్నాడు.
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
India A’s squad for tour of England announced.
All The Details 🔽
— BCCI (@BCCI) May 16, 2025
భారత ఏ జట్టు స్క్వాడ్ : అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, శార్ధూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), మానవ్ సుథార్, తనుష్ కొతియాన్, ముకేశ్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రానా, అన్షుల్ కంబోజ్, ఖలీల్ అహ్మద్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే.
ఐపీఎల్ 18వ సీజన్ నుంచి రాజస్థాన్, చెన్నై జట్లు వైదొలగడంతో.. యశస్వీ, రుతురాజ్ గైక్వాడ్‌లు ఇంగ్లండ్ చేరుకోనున్నారు. జూన్ 3న ఫైనల్ జరుగనుండగా.. మే 30న ఇంగ్లండ్ లయన్స్‌తో భారత ఏ జట్టు తలపడనుంది. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ ఫైనల్ చేరుకుంటే శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లు ఆసల్యంగా ఇంగ్లండ్ చేరుకునే అవకాశముంది.