Duleep Trophy : దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో ‘ఇండియా బీ’ దీటుగా బదులిస్తోంది. ‘ఇండియా సీ ‘బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న అభిమన్యు ఈశ్వరన్(51 నాటౌట్), జగదీశన్ (67 నాటౌట్)లు అర్ధ శతకాలతో రాణించారు. దాంతో, రెండో రోజు ఆట ముగిసేసరికి ఇండియా బీ వికెట్ కోల్పోకుండా 124 రన్స్ చేసింది. అయినా ఇంకా 401 పరుగుల వెనకబడే ఉంది.
తొలి రోజు ఇషాన్ కిషన్(111) మెరుపు సెంచరీతో పుంజుకున్న ఇండియా బీకి బాబా ఇంద్రజిత్(78) అర్ధ శతకంతో భారీ స్కోర్ అందించాడు. అయితే.. ఇండియా సీ పేసర్ ముకేశ్ కుమార్(4/126), స్పిన్నర్ రాహుల్ చాహర్(4/73) విజృంభణతో ఇండియా బీ 525 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
ఇషాన్ కిషన్(111)
మరో మ్యాచ్‌లో ‘ఇండియా ఏ’ బ్యాటర్లు కూడా దంచి కొడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 290 రన్స్ కొట్టిన ఇండియా ఏ రెండో ఇన్నింగ్స్‌ను ధాటిగా మొదలెట్టింది. ఓపెనర్లు ప్రథమ్ సింగ్(59), మయాంక్ అగర్వాల్(56)లు ‘ఇండియా డీ’ బౌలర్లను ఉతికేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. తొలి వికెట్‌కు శతక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ జోడీని శ్రేయస్ అయ్యర్ విడదీశాడు.
Golden Arm! 💪
Shreyas Iyer comes into the attack. Shreyas Iyer strikes first ball 👌
An excellent low catch off his own bowling, and he breaks the 115-run opening stand at the stroke of stumps. #DuleepTrophy | @IDFCFIRSTBank
Scorecard ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/c1nXJsN8QM
— BCCI Domestic (@BCCIdomestic) September 13, 2024
కాసేపట్లో ఆట ముగుస్తుందనగా బంతి అందుకున్న అయ్యర్.. మయాంక్ వికెట్ సాధించాడు. దాంతో, ఇండియా ఏ జట్టు వికెట్ నష్టానికి 115 రన్స్ చేయగలిగింది. ప్రస్తుతానికి ఆ జట్టు 222 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా డి ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్(92) అర్ద శతకంతో మెరిసినా కూడా మిగతావాళ్లు చేతులెత్తేశారు. ఖలీల్ అహ్మద్(3/39), అఖీబ్ ఖాన్(3/41)లు చెలరేగడంతో శ్రేయస్ అయ్యర్ బృందం 183కే కుప్పకూలింది.
Pacers Khaleel Ahmed & Aaqib Khan have impressed so far for India A with 2⃣ wickets each!
Watch 📽️ all the 4⃣ India D wickets to fall in the morning session on Day 2 🔽#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️: https://t.co/m9YW0HttaH pic.twitter.com/7GIOzLwpa5
— BCCI Domestic (@BCCIdomestic) September 13, 2024