Realme P2 Pro 5G | రియల్మీ నుంచి రియల్మీ పీ2 ప్రో.. ధరెంతంటే..?!
Realme P2 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది.
Realme P2 Pro 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్మీ (Realme) తన రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీంతోపాటు రియల్మీ పాడ్ 2 లైట్ (Realme Pad 2 Lite) కూడా తీసుకొచ్చింది. రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ 4 ఎన్ఎం ఒక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ఎస్వోసీ, 80వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 50-మెగా పిక్సెల్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ కెమెరా ఉంటాయి. మూడు ర్యామ్, మూడు స్టోరేజీ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.
రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.21,999, 12 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 12 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.27,999 లకు లభిస్తుంది. ఈగల్ గ్రే, ప్యారెట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఈ నెల 17 సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ ఎర్లీ బర్డ్ సేల్స్ జరుగుతాయి. రియల్మీ ఇండియా వెబ్ సైట్, ఫ్లిప్ కార్ట్ ద్వారా సేల్స్ ప్రారంభం అవుతాయి. ఎర్లీ బర్డ్ సేల్స్ కింద రూ.2,000, బ్యాంకు డిస్కౌంట్ కింద రూ.1,000 రాయితీ ఉంటుంది. మూడు నెలల వరకూ నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ లభిస్తుంది.
రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటు, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 2000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.7 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2412 పిక్సెల్స్) 3డీ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 బేస్డ్ రియల్ మీ యూఐ 5 ఓఎస్ వర్షన్ పై పని చేస్తుంది.
రియల్ మీ పీ2 ప్రో 5జీ (Realme P2 Pro 5) ఫోన్ 50-మెగా పిక్సెల్ సోనీ ఎల్వైటీ 600 ప్రైమరీ సెన్సర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. 80వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తోంది. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్, షాక్ అబ్జార్బింగ్ ఆర్మూర్ షెల్ ప్రొటెక్షన్ ఉంటాయి. 5జీ, వై-ఫై 6, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

