Wine Shops | హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో మద్యం షాపులు, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నిమజ్జనోత్సవం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలను మూసివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెల 17న ఉదయం 6 గంటల నుంచి 18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని, అప్పటి వరకు మద్యం సరఫరాపై నిషేధం ఉంటుందన్నారు. నిషేధిత సమయంలో ఎవరైన నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరిపినా, సరఫరా చేసినా బెల్టుషాపులు నిర్వహించినా చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీపీ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Transgenders | హైదరాబాద్లో ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్జెండర్లు : సీఎం రేవంత్ రెడ్డి
Cyberabad | సెప్టెంబర్ 14 నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
Weather Update | రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలోమరో అల్పపీడనం