Weather Update | హైదరాబాద్ : రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే కోస్తా బంగ్లాదేశ్, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. ఆ తరువాత 48 గంటల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ వాయుగుండంగా అల్పపీడనం బలపడుతుంది. పశ్చిమ బెంగాల్, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముంది.
దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. కోస్తాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని.. మిగతా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో వాయవ్య దిశగా గాలులు వీస్తున్నాయని తెలిపింది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.
ఇవి కూడా చదవండి..
Crocodile | జూరాల డ్యాం రోడ్డుపై మొసలి.. భయంతో పరుగులు తీసిన జనం
Harish Rao | రాహుల్ గాంధీ లెక్చర్లు ఆపి.. రాజ్యాంగ ఉల్లంఘనలపై మాట్లాడండి : హరీశ్‌రావు
Harish Rao | రేవంత్ విసిరే రాళ్లు.. రేపటి మా ప్రభుత్వానికి పునాది రాళ్లు : హరీశ్‌రావు