సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 26: దేశానికే రోల్ మోడల్ సిద్దిపేట. అభివృద్ధి సంక్షేమ పథకాలను ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రజలకు అందిస్తూ ఆదర్శంగా నిలిపారని టీఆర్ఎస్ అభ్యర్థులు నినదిస్తూ ఎన్నికల ప్రచార పర్వంలో దూసుకెళ్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి వరాల కవిత సురేశ్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటి ముందు అభివృద్ధి, కంటి ముందు అభ్యర్థి మా నినాదమని చెబుతూ ప్రచారంలో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ నా పెద్దకొడుకు
టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 7వ వార్డు అభ్యర్థి ముత్యాల శ్రీదేవి బుచ్చిరెడ్డి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఓ అవ్వను ఓటు అభ్యర్థించగా సీఎం కేసీఆరే నా పెద్దకొడుకు అని ఆసరా పెన్షన్లు అందిస్తూ అండగా ఉన్నాడని, సంతోషంగా బతుకుతున్నానని కారు గుర్తుకే ఓటేస్తానని చెప్పింది. 37వ వార్డు టీఆర్ఎస్ అభ్యర్థి సాకి బాల్‌లక్ష్మి ఆనంద్, 39వ వార్డు అభ్యర్థి నాగరాజు, 35వ వార్డు అభ్యర్థి మాంకాల నాగరాణి నవీన్‌కుమార్‌లు ఇంటింటి ప్రచారంలో పాల్గొని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. టీఆర్ఎస్ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారంలో పాల్గొన్నారు.