e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home సిద్దిపేట 5 రోజుల్లో జ్వర సర్వే పూర్తి

5 రోజుల్లో జ్వర సర్వే పూర్తి

5 రోజుల్లో జ్వర సర్వే పూర్తి
  • రెండో విడత సర్వేను పూర్తి చేయాలి
  • తొలి విడత సర్వేతో పెరిగిన భరోసా
  • మెడికల్‌ కిట్‌ తీసుకున్నవారి ఆరోగ్య బాధ్యత సర్వే అధికారులదే
  • టెలీకాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి

గజ్వేల్‌అర్బన్‌, మే 24 : సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో నిర్వహించిన తొలి విడత జ్వర సర్వేతో ప్రజల్లో ఆత్మైస్థ్యెర్యం పెరిగిందని కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. అదే స్ఫూర్తితో జిల్లాలో రెండు రోజులుగా రెండో విడత ఇంటింటి జ్వర సర్వేను వందశాతం విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ములుగు కలెక్టరేట్‌ నుంచి రెండో విడత జ్వర సర్వే తీరుపై ఆర్డీవోలు, క్లస్ట్‌ ఇన్‌చార్జిలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, వైద్య, ఆరోగ్య అధికారుల, క్షేత్ర సిబ్బందితో కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జిల్లాలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మొత్తం 2లక్షల 90వేల గృహాలను రెండో విడత జ్వరసర్వే నిర్వహించాలన్నారు. ప్రజలతో పాటు ప్రజాప్రతినిధుల ఇండ్లలోనూ సర్వేను చేయాలని ఆదేశించారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 666 గ్రామబృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వందమందికిపైగా అధికారులు పర్యవేక్షణ అధికారులు గా నియమించామన్నారు.

సర్వే ద్వారా లక్షణాలున్న వారిని ముందస్తుగా గుర్తించడంతో కొవిడ్‌ వ్యాప్తి నివారణతో పాటు హోం ఐసొలేషన్‌ జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. సర్వే నివేదికలు రోజూవారీగా సమర్పించాలని, లక్షణాలతో బాధపడుతున్న వ్యక్తుల ప్రస్తుత పరిస్థితిని ఆరా తీయాలని కలెక్టర్‌ సూచించారు.అదనపు కలెక్టర్‌ ముజామ్మిల్‌ ఖాన్‌ మాట్లాడుతూ సర్వేలో ఎవరైనా కరోనా బారిన పడినట్లు గుర్తిస్తే వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచాలని, అవకాశం లేకపోతే నివసించే ప్రాంతాన్ని బట్టి గజ్వేల్‌ ఆర్వీ ఎం, హుస్నాబాద్‌ సురభి, సిద్దిపేటలోని బాబూజగ్జీవన్‌రాం భవనం, ప్రభుత్వ జనరల్‌ దవాఖానలలోని హోంఐసొలేషన్‌ కేంద్రాలకు పంపించాలని సూచించారు. గ్రామంలో పది మంది కంటే ఎక్కువ కరోనా బాధితులుంటే వా రికి ఆ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల లేదా ఇతర ప్రభుత్వ భవనాలలో హోం ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టెలీకాన్ఫరెన్స్‌లో డీఆర్‌డీవో గోపాల్‌రావు, వైద్యాధికారులు డాక్టర్‌ కాశీనాథ్‌, డాక్టర్‌ మహేశ్‌ ఉన్నారు.

కుటుంబ సభ్యులుగా భావించి పేషెంట్లకు సేవ చేయాలి..
కొవిడ్‌ పేషంట్లను తమ కుటుంబ సభ్యులుగా భావించి వైద్య సేవలు చేయాలని వైద్య సిబ్బందికి, వైద్యాధికారులకు కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సూచించారు. సిద్దిపేట మెడికల్‌ కళాశాల వైద్య సిబ్బంది, వైద్యులు, పారామెడికల్‌, సెక్యూరిటీ, పేషంట్‌ కేర్‌ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ మంత్రి హరీశ్‌రావు కృషితో ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించుకున్నామని, ఆ నిధులను మరిన్ని సేవలకు వినియోగించనున్నట్లు తెలిపారు. సిబ్బంది సమయ పాలన పాటించే విధం గా బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశ పెట్టాలని సూ పరింటెండెంట్‌ జయశ్రీని ఆదేశించారు. కొవిడ్‌ వార్డులో విధులు నిర్వర్తిసున్నవారికి నెలానెలా ఇచ్చే వేతనంతో పాటు అదనపు వేతనాన్ని జిల్లా నిధుల నుంచి ఇస్తామని కలెక్టర్‌ తెలిపారు. కొవిడ్‌ వార్డులో పని చేసే సిబ్బంది ధైర్యంగా ఉండాలని, మీ వెంట జిల్లా యంత్రాంగం ఉందని భరోసా కల్పించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అందరూ విధులకు హా జరయ్యేలా చూడాలని వైద్యులు కాశీనాథ్‌, పవన్‌కు సూచించారు. వీరిద్దరూ దవాఖాన ఇన్‌చార్జ్జిలుగా ప్రతి 12 గంటలకు ఒకరు చొప్పున ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు దీప్తీనాగరాజు, ప్రవీణ్‌కు పలు బాధ్యతలు అప్పగించారు. కార్యక్రమంలో మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ తమిళఅరుసు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ జయశ్రీ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు పూర్తయ్యేవరకు పర్యవేక్షించాలి
కొనుగోళ్లు ముగిసే వరకు బాధ్యులైన అధికారులు క్షేత్రస్థాయిలో ఉం టూ కొనుగోళ్ల ప్రక్రియను పర్యవేక్షించాలని కలె క్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. ధాన్యం కొను గోళ్లపై జిల్లా స్థాయి అధికారులు, సిబ్బందితో ములుగు కలెక్టరేట్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వ హించారు. జిల్లాలో ఇప్పటివరకు 50శాతం ధా న్యం కొనుగోళ్లు పూర్తయ్యాయని, మరో 10 రోజు లపాటు అధికారులంతా కొనుగోలు కేంద్రాల వద్దే ఉంటూ ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ట్యాబ్‌ ఎంట్రీ, రైతులకు చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాల న్నారు. ఇప్పటివరకు 50,351మంది రైతులకు సంబంధించిన రూ.470కోట్ల విలువైన ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశామని, 35, 998రైతులకు రూ.342కోట్లు ఖాతాల్లో జమ చేశామన్నారు. మిగతా రైతులకు మంగళవారం సాయంత్రంలోపు చెల్లింపులు పూర్తి చేయాలన్నా రు. ధాన్యానికి సంబంధించి జిల్లా పౌరసరఫరాల మేనేజర్‌ ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. గన్నీబ్యాగులు, టార్ఫాలిన్ల కొరత లేకుండా అధి కారులు పర్యవేక్షించాలన్నారు. క్లస్టర్‌ ఇన్‌చార్జిలు లారీలు, డీసీఎంల వివరాలు సేకరించి ఆర్టీవో స హకారంతో ధాన్యం తరలించాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌, డీఆర్వో చెన్నయ్య, ఆర్డీవోలు, డీఆర్డీవో గోపాల రావు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ హరీశ్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
5 రోజుల్లో జ్వర సర్వే పూర్తి

ట్రెండింగ్‌

Advertisement