సోమవారం 01 మార్చి 2021
Siddipet - Jan 26, 2021 , 00:17:14

భారత పౌరులమైన మేము..

భారత పౌరులమైన మేము..

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించిన అధికారులు

ర్యాలీలో పాల్గొన్న యువకులు, ఓటర్లు

ఓటరుగా నమోదు చేసుకోవాలి 

గజ్వేల్‌ అర్బన్‌/కొండపాక/ సిద్దిపేట/సిద్దిపేట రూరల్‌ , జనవరి 25 : ఓటరుగా తమ పేరును నమోదు చేసుకుని ఓటుహక్కు పొందడం ప్రతి పౌరుని బాధ్యతని గజ్వేల్‌ ఆర్డీవో విజయేందర్‌ రెడ్డి అన్నారు. సోమవారం 11వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని గజ్వేల్‌ ఐవోసీ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో విజయేందర్‌రెడ్డి నూతనంగా ఓటరుగా నమోదు చేసుకున్న యువకులను బ్యాడ్జితో సత్కరించారు. అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ అన్వర్‌, నాయ బ్‌ తహసీల్దార్‌ నర్సింహారెడ్డి, ఎన్నికల సీనియర్‌ అసిస్టెంట్‌ నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.

సిద్దిపేటలో...  

 జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని నెహ్రూ యువకేంద్రం, భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, ఎన్‌సీసీ సమన్వయంతో ర్యాలీ, ఓటరు ప్రతిజ్ఞ నిర్వహించారు. ఓటు హక్కుపై వ్యాసరచన పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఓటు అనే ఆకారంలో కూర్చుని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో నెహ్రూ యు వ కేంద్ర అధికారి కిరణ్‌కుమార్‌, ఎన్‌సీసీ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డి, వలంటీర్లు నర్సింహులు, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కొండపాకలో..

కొండపాకలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని  తహసీల్దార్‌ రామేశ్వర్‌  నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్‌ సిటిజన్‌ పాపయ్యను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచు చిట్టి మాధురి, ఉప సర్పంచు భాస్కర్‌, పంచాయతీ కార్యదర్శి స్వప్న  పాల్గొన్నారు. 

నారాయణరావుపేటలో.. 

  నారాయణరావుపేటలో  ఎంపీపీ ఒగ్గు బాలకృష్ణ, తహసీ ల్దార్‌ రేణుక ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.  ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అనంతరం ఇద్దరు సీనియర్‌ సిటిజన్లను సన్మానించారు. 

రాఘవాపూర్‌లో..

 రాఘవాపూర్‌లో తహసీల్దార్‌ ఉమారాణి ఆధ్వర్యంలో  జాతీ య ఓటరు దినోత్సవాన్ని  నిర్వహించారు.  ప్రజాస్వామ్యం లో ఓటే వజ్రాయుధమని తెలిపారు. 

VIDEOS

logo