పకడ్బందీగా ఏర్పాట్లు

వ్యాక్సినేషన్‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలి
అవాంఛనీయ ఘటనలు లేకుండా చూడాలి
ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం కావాలి
వ్యాక్సిన్ పంపిణీపై అధికారులతో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి సమీక్ష
సిద్దిపేట కలెక్టరేట్, జనవరి 12) : ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో జిల్లాలో మొదటి దశ వ్యాక్సినేషన్ విజయవంతం చేసేందుకు అధికారులు అన్ని విధాలా సన్నద్ధ్దంగా ఉండాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి ఆదేశించారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో ఈ నెల 16న తొలి కొవిడ్ వ్యాక్సినేషన్‌పై చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం సెట్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. మంత్రి హరీశ్‌రావు మార్గదర్శనం మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. రెండు జిల్లాల్లో తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేస్తున్న హెల్త్‌కేర్ వర్కర్స్కు వంద శాతం వ్యాక్సినేషన్ ఇవ్వాలన్నారు. వ్యాక్సినేషన్ పంపిణీ సజావుగా జరిగేలా చూసేందుకు సిద్దిపేట జిల్లా దవాఖానకు అదనపు కలెక్టర్ ముజామ్మీల్ఖాన్, ఆర్వీఎం దవాఖానకు అదనపు కలెక్టర్ ఎస్.పద్మాకర్, గజ్వేల్ ఏరియా దవాఖానకు డీఆర్డీవో గోపాల్‌రావు, మెదక్‌లో వ్యాక్సినేషన్ చేసే కేంద్రాల్లో స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రారం భానికి మంత్రులు, జడ్పీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరినీ ఆహ్వానించాలన్నారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి క్షేత్రస్థాయి రిపోర్టులను సంబంధిత అధికారులకు ఎప్పటికప్పుడు పంపాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రారంభించే కేంద్రాల్లో గైడ్‌లైన్స్ ప్రకారం వసతులు కల్పించాలని సూచించారు.
జనవరి నెలాఖరులోగా ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలి
ముట్రాజ్‌పల్లి ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణ పనులను వేగ వంతం చేసి జనవరి నెలాఖరులోపు ఇండ్లను అందుబాటు లోకి తేవాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అన్నారు. ముట్రాజ్‌పల్లి పునరావాస కాలనీ పనుల పురోగతిపై కలెక్టరేట్లో అధికారు లు, ఏజెన్సీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. 1450 ఇండ్ల ను జనవరి నెల చివరికల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఫంక్షన్‌హాల్, సామూహిక భవనం, వాటర్ ట్యాంకు, మిషన్ భగీరథ పైపులైన్, అన్ని పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిం చాలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ పద్మాకర్, ఎస్‌ఈపీఆర్ కనకరాజు, డీఈ రామచందర్, ఏజెన్సీ ప్రతినిధులు బాపి నీడు, చంద్రశేఖర్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు.
తాజావార్తలు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- అగ్రిహబ్‌కు నాబార్డ్ 9 కోట్లు
- ఉప ఎన్నికలేవైనా.. గెలుపు టీఆర్ఎస్దే
- ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
- కరోనా టీకా తప్పక వేయించుకోవాలి
- వైభవంగా నిర్వహించాలి
- రెన్యూవబుల్ ఎనర్జీలో
- ధర్మపురి ఆలయానికి స్థపతి వల్లినాయగం
- 7న బ్రాహ్మణ పెద్దలతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టి
- సినీ హీరోగా సింగరేణి బిడ్డ