నేటి నుంచి నామినేషన్ల పర్వం

- నేడు దుబ్బాక ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల
- ఈనెల 16 వరకు నామినేషన్లకు అవకాశం
- కొవిడ్-19 నిబంధనలతో ఎన్నికలు
- నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు :ఆర్వో చెన్నయ్య
- మార్గదర్శకాలు జారీచేసిన ఈసీ
దుబ్బాక : సిద్దిపేట జిల్లా దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం నేటి నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం ఉదయం నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈనెల 19 వరకు అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు తుది గడువు ఉంది. ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. గతంతో పోల్చితే ఈసారి కరోనా నేపథ్యంలో విభిన్న పరిస్థితుల్లో ఎన్నికల ప్రక్రియ కొనసాగనున్నది. కొవిడ్-19 మార్గదర్శకాల మేరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు దుబ్బాక ఉప ఎన్నికల రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు.
నామినేషన్ ఆన్‌లైన్‌లోనూ వేయొచ్చు..
ఈసారి అభ్యర్థులు నామినేషన్ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ, అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారికి నేరుగా అందజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగతా రోజుల్లో నామినేషన్లు స్వీకరిస్తామని ఆయన తెలిపారు. ఇందులో రెండో శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. మిగతా రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించేందుకు అవకాశం ఉంది. దుబ్బాక తహసీల్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నామినేషన్ దాఖలు సమయంలో అభ్యర్థితో వెంట ఇద్దరికి మాత్రమే అనుమతి ఉన్నది. ఇందుకు రెండు వాహనాలు వినియోగించడానికి అవకాశం ఉంది. వాటిని రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కార్యాలయానికి వంద మీటర్ల దూరంలోనే నిలిపివేయాలి. నామినేషన్లకు సంబంధించిన వాటిపై ఏమైనా సందేహాలు ఉంటే, కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ‘హెల్ప్‌డెస్క్'లో సంప్రదించాలని రిటర్నింగ్ అధికారి చెన్నయ్య తెలిపారు. ఈ సందర్భంగా నామినేషన్ల దాఖలు సమయంలో పాటించాల్సిన సూచనలను ఆయన వెల్లడించారు.
పాటించాల్సిన నిబంధనలు..
1) నామినేషన్ పత్రం ఫారం-2 బీలో సమర్పించాలి.
2)అభ్యర్థి స్టాంపు సైజు ఫొటో..( మూడు నెలలలోపు దిగినదై ఉండాలి). తెలుపు రంగు బ్యాక్ గ్రౌండ్, కలరు లేదా బ్లాక్ అండ్ వైట్ ఫొటో టోపీ లేదా నల్ల అద్దాలు ధరించిన ఫొటో సమర్పించరాదు.
3)ఫొటో వెనుక అభ్యర్థి లేదా అభ్యర్థి ఎన్నికల ఏజెంటు సంతకం చేయాలి.
4) సెక్యూరిటీ డిపాజిట్ రూ.10 వేలు/ షెడ్యూలు కులాల వారికి రూ.5వేలు(కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.)
5) నూతన అఫిడవిట్ ఫారం-26లోని అన్ని గడులను పూరించాలి.
6) రాజకీయ పార్టీ వారు రిజిష్టర్ చేయబడిన గుర్తింపు పొందిన వారు ఫారం-ఏ,బీ లకు ఇంకు సంతకంతో కూడిన అసలు ప్రతులు సమర్పించాలి.
7) సెల్ఫ్ ఫారం అనగా.. అభ్యర్థి బ్యాలెట్ పేపర్ మీద తన పేరు ఏ విధముగా ధ్రువీకరించగలరో తెలియజేయి పత్రం..
8)గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి ఒక ప్రతిపాదకులు, రిజిష్టర్డ్ రాజకీయ పార్టీలు/ స్వతంత్ర అభ్యర్థులకు 10మంది ప్రతిపాదకులు అవసరం.
9) అభ్యర్థి గుర్తుల జాబితా నుంచి 3 గుర్తులను తన నామినేషన్ పత్రములో తెలపాల్సి ఉంటుంది.
10)అభ్యర్థి ఇతర నియోజకవర్గానికి చెందిన వారైతే ఓటరుగా తెలియజేయుటకు సంబంధిత అధికారి నుంచి సర్టిఫైడ్ కాపీ సమర్పించాలి.
11) నామినేషన్ తేదీ కన్న ముందు ఎన్నికల నిమిత్తం కొత్త బ్యాంక్ ఖాతా తెరిచి, వివరములు నామినేషన్ పత్రంతో సమర్పించాలి.
12) కొవిడ్-19 నేపథ్యంలో నామినేషన్ వేసి అభ్యర్థితో పాటు (1+2) ముగ్గురిని మాత్రమే అనుమతి ఉంటుంది.
13) అభ్యర్థి ఎన్నికల నిమిత్తం తెరిచిన బ్యాంక్ ఖాతా ప్రతిని సమర్పించాల్సి ఉంటుందని రిటర్నింగ్ అధికారి తెలిపారు.
తాజావార్తలు
- మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశం
- దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 16,752 కేసులు
- ప్రముఖ నటుడితో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న ఆహా
- ఇక వాట్సాప్ గ్రూపులు వాడబోమన్న సుప్రీంకోర్టు
- అటవీ అధికారులపై దాడికి యత్నం
- అభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం
- డివైడర్‌పై నుంచి దూసుకెళ్లి లారీ ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి
- ఇది ట్రైలరే.. అంబానీకి జైషుల్ హింద్ వార్నింగ్
- మద్దతు కోసం.. ఐదు రాష్ట్రాల్లో రాకేశ్ తికాయిత్ పర్యటన
- మెగాస్టార్‌కు సర్జరీ..సక్సెస్ కావాలంటూ ప్రార్ధనలు