12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అనుమతి తెలిపిన కెనడా
12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్.. అనుమతి తెలిపిన కెనడా | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. 12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్-బయో ఎన్‌టెక్ కొవిడ్ టీకాను వేసేందుకు కెనడా ప్రభుత్వం అనుమతి తెలిపింది.

ఒట్టావా : కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మరో ముందడుగు పడింది. 12-15 ఏళ్లలోపు పిల్లలకు ఫైజర్-బయో ఎన్‌టెక్ కొవిడ్ టీకా వినియోగానికి కెనడా ప్రభుత్వం అనుమతి తెలిపింది. పూర్తిస్థాయి శాస్త్రీయ సమీక్ష అనంతరం పిల్లలకు వ్యాక్సిన్ సురక్షితమైన, ప్రభావవంతమైనదిగా గుర్తించినట్లు కెనడా హెల్త్ ముఖ్య వైద్య సలహాదారు సుప్రియ శర్మ బుధవారం తెలిపారు. ప్రపంచంలోనే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అనుమతి ఇచ్చిన మొదటి దేశంగా నిలిచింది. కెనడియన్ ప్రభుత్వం గత డిసెంబర్లో 16 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి టీకా వేసేందుకు అనుమతి ఇచ్చింది.
12 నుంచి 15 సంవత్సరాల వయస్సులో పాల్గొన్న వారి ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్ ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో 12-15 ఏళ్ల మధ్య వయస్సున్న 2,260 మంది కౌమార బాలబాలికలు అధ్యయనంలో పాల్గొన్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారందరికీ రెండో మోతాదు ఇచ్చిన తర్వాత రెండేళ్ల పాటు దీర్ఘకాలిక సంరక్షణ, భద్రతను పర్యవేక్షించనున్నారు. ‘యువత కొవిడ్-19 తీవ్రమైన కేసులను అనుభవించే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ.. సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కుటుంబం, స్నేహితులు వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో సహాయపడుతుందని సుప్రియ’ శర్మ తెలిపారు.
టీకా తీసుకున్న కొందరిలో సాధారణంగా, తాత్కాలిక దుష్ప్రభావాలు, తేలికపాటి నొప్పులు, చలిజర్వం రావొచ్చని పేర్కొన్నారు. అయితే, టీకాల పంపిణీ ప్రారంభం ఆయా ప్రావిన్సుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని వివరించారు. ఇదిలా ఉండగా.. ఫైజర్ ఇప్పటి వరకు కెనడాకు 11 మిలియన్ల మోతాదులు పంపిణీ చేయగా.. జూన్ నాటికి ప్రతి వారం రెండు మిలియన్ల మోతాదులు సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
మరో రెండు రోజులు వానలు
ఏపీలో విజృంభిస్తున్న కరోనా.. సరిహద్దులను మూసివేసిన ఛత్తీస్‌గఢ్
దేశంలో 16.24 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్యశాఖ
టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం
06-05-2021 గురువారం.. మీ రాశి ఫలాలు
క్యాన్సర్ రోగులూ కరోనాతో జాగ్రత్త
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stepson Kills Stepmother | సవతి తల్లిపై డీజిల్ పోసి.. నిప్పంటించిన సవతి కుమారుడు
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని ఖమ్మం కలెక్టరేట్ ముట్టడి
Raihan Vadra: ఎగ్జిబిషన్ నుంచి ప్రియాంకా గాంధీ కుమారుడి 75 ఫోటోలు తొలగింపు
Farmers | జనరేటర్‌కు ఒక్క రోజుకే రూ.7 వేలు ఖర్చు పెట్టినం.. హరీశ్ రావుతో రైతు ఆవేదన
Sanju Samson: సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

