e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News క‌రోనా వేళ‌.. వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

క‌రోనా వేళ‌.. వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

క‌రోనా వేళ‌.. వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల నేప‌థ్యంలో స్థిరంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. ఫ‌లితాలు వెలువ‌డిన మ‌రుస‌టి రోజు నుంచే దేశీయ చ‌మురు కంపెనీలు ధ‌ర‌ల‌ను పెంచుతూ వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో వ‌రుస‌గా మూడో రోజూ వాహ‌ణ‌దారుల‌పై భారం మోపాయి. నిన్న లీట‌ర్ పెట్రోల్‌పై 19 పైస‌లు, లీటర్ డీజిల్‌పై 21 పైసల చొప్పున పెంచ‌గా, ఇవాళ మరోసారి 25 పైస‌లు, 30 పైస‌ల చొప్పున బాదాయి. దీంతో దేశ రాజ‌ధాని ఢిల్లీలో లీట‌ర్ పెట్రోల్ ధ‌ర రూ.90.99, డీజిల్‌ రూ.81.42కు చేరింది. ఇక తాజా పెంపుతో ముంబైలో పెట్రోల్ రూ.97.34, డీజిల్‌ రూ.88.39, చెన్నైలో పెట్రోల్‌ రూ.92.90, డీజిల్‌ రూ.86.35, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.91.14, డీజిల్‌ రూ.84.26కు చేరాయి.

ఇక బెంగ‌ళూరులో పెట్రోల్‌ రూ.94.01, డీజిల్‌ రూ.86.31కు, హైద‌రాబాద్‌లో పెట్రోల్‌ రూ.94.57, డీజిల్‌ రూ.88.77కు, జైపూర్‌లో పెట్రోల్‌ రూ.97.03, డీజిల్‌ రూ.89.62కు చేరాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధ‌మైన ప‌న్నులు విధిస్తుండ‌టంతో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల్లో తేడాలు ఉంటాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..
మ‌ళ్లీ 4 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు.. 4 వేల‌కు చేరువ‌లో రోజువారీ మ‌ర‌ణాలు
ఏపీలో విజృంభిస్తున్న క‌రోనా.. స‌రిహ‌ద్దుల‌ను మూసివేసిన ఛ‌త్తీస్‌గ‌ఢ్‌
టీకా మేధోసంపత్తి హక్కుల రద్దుకు అమెరికా ఆమోదం
క‌శ్మీర్‌లో ఎన్‌కౌంట‌ర్‌.. ముగ్గురు ముష్క‌రులు హ‌తం
మేఘాలయ ఖాసీహిల్స్‌లో లాక్‌డౌన్‌
దేశంలో 16.24 కోట్ల టీకాల పంపిణీ : ఆరోగ్యశాఖ
విదేశీ సాయంపై పారదర్శకత ఏది?
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా వేళ‌.. వ‌రుస‌గా మూడో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు

ట్రెండింగ్‌

Advertisement