ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Oct 07, 2020 , 03:04:56

సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని వమ్ము చేయను : సోలిపేట సుజాత

సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని వమ్ము చేయను : సోలిపేట సుజాత

సీఎం కేసీఆర్‌ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత స్పష్టం చేశారు. తనపై నమ్మకంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీచేసే అవకాశం కల్పించినందుకు తమ కుటుంబం సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటుందన్నారు. రామలింగారెడ్డికి అవకాశం ఇచ్చి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని, ఇప్పుడు తనకు ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు చెప్పారు. పెండ్లి పెద్దగా ఉండి ఆనాడు సీఎం కేసీఆర్‌ తమ పెండ్లి చేశారని, అదేవిధంగా మా పిల్లలకు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా పెండ్లిలు జరిగాయని ఈ సందర్భంగా సుజాత గుర్తుచేశారు. రామలింగారెడ్డి మృతితో ధైర్యాన్ని కోల్పోయిన తమకు సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు గ్రామానికి వచ్చి ధైర్యాన్ని నింపారని ఈ సందర్భంగా సుజాత భావోద్వేగానికి గురయ్యారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న మంత్రి హరీశ్‌రావు కండ్లలో నుంచి కన్నీరు పొంగుకు వచ్చింది. మంత్రి తన కన్నీళ్లు తుడుచుకుంటూ...ఆమెను ఓదార్చారు. 

VIDEOS

logo