సోమవారం 21 సెప్టెంబర్ 2020
Siddipet - May 19, 2020 , 23:34:03

ఉప్పొంగంగ

ఉప్పొంగంగ

అక్కారం వెట్న్‌ విజయవంతం

గజ్వేల్‌ రూరల్‌: కొండపోచమ్మసాగర్‌ ప్రాజెక్టులోకి గోదావరి జలాల తరలింపు ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. గజ్వేల్‌ మండలం అక్కారం ఒకటో నెంబర్‌ పంప్‌ వెట్న్‌ మంగళవా రం సాయంత్రం విజయవంతమైంది. కొండపోచమ్మలోకి గోదా రమ్మ రాకకు సమయం ఆసన్నమైంది.  వెట్న్‌ కోసం నిపుణులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో సాయంత్రం 5.30 గంటలకు గోదావరమ్మ కాలువ ద్వారా మర్కూక్‌ వైపు పరుగుపెట్టింది. అక్కారం పంప్‌ వద్ద ప్రారంభానికి ముందు అధికారులు కొండపోచమ్మ దేవాలయంలో సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కారం వద్ద ఒకటో నెంబర్‌ మోటర్‌ను ప్రారంభించి, 1.10 గంటల పాటు నడిపించారు. అక్కారం నుంచి నీళ్లు మర్కూక్‌ సంప్‌ వద్దకు చేరుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఐదు రోజుల క్రితం తుక్కాపూర్‌ నుంచి కాలువల ద్వారా గోదావరి జలాలను అక్కా రం వరకు పంపింగ్‌ చేయడంతో కాలువల్లో నీళ్లు నిల్వ ఉన్నా యి. అక్కారం సర్జిపూల్‌ పంప్‌ వద్ద 27 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు మోటర్ల ద్వారా మర్కూక్‌ సంప్‌కు నీటిని వదులుతారు. మర్కూక్‌ నుంచి మోటర్ల ద్వారా నేరుగా కొండ పోచమ్మ సాగర్‌లోకి గోదావరి జలాలను పంపిస్తారు. అక్కారం మొదటి మోటర్‌ పంపింగ్‌ అయిన జలాలు శ్రీగిరిపల్లి వద్ద చూ సేందుకు చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు, రైతులు, గజ్వేల్‌ పట్ట ణవాసులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ హరిరామ్‌, ఎస్‌ఈ వేణు, టెక్నాలజీ సలహాదారుడు పెంటారెడ్డి, ఆర్డీవో విజయేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మర్కూక్‌కు చేరిన జలాలు

మర్కూక్‌: అక్కారం వెట్న్‌ విజయవంతం కావడంతో 6.5 కిలోమీటర్ల కాలువ ద్వారా గోదావరి నీళ్లు మర్కూక్‌ వరకు చేరుకున్నాయి. మర్కూక్‌ పంప్‌హౌస్‌లో 34 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు పంప్‌సెట్లు ఉండగా, త్వరలో డ్రైరన్‌, ఆ వెంటనే వెట్న్‌ నిర్వహించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. ఇక్కడ మోటార్లు పని చేస్తే నేరుగా కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి గోదావరి నీళ్లు చేరుకుంటాయి. మర్కూక్‌ చేరుకున్న గోదావరి నీళ్లను చూసి స్థానిక నాయకులు, ప్రజలు సంబరపడ్డారు.


logo