Dolby Atmos : డాల్బీ అట్మాస్ సౌండ్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
డాల్బీ అట్మాస్ సౌండ్ | ప్రతి థియేటర్లో, టీవీల్లో, స్మార్ట్ఫోన్లలో డాల్బీ అట్మాస్ సౌండ్‌ను పేరును వింటున్నాం. కానీ.. అది ఎలా పనిచేస్తుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ అంటే ఏంటి
ఏదైనా సినిమా చూసినా.. పాటలు విన్నా.. సౌండ్ క్లారిటీ బాగుండాలి. లేకపోతే.. అంత ఆసక్తితో సినిమాను చూడలేం. పాటను వినలేం. ఆడియో క్లారిటీ బాగుంటేనే సినిమాను ఎంజాయ్ చేస్తాం. అందుకే ఈ మధ్య.. ప్రతి థియేటర్లో, టీవీల్లో, స్మార్ట్ఫోన్లలో డాల్బీ అట్మాస్ సౌండ్‌ను పేరును వింటున్నాం. కానీ.. అది ఎలా పనిచేస్తుంది. డాల్బీ అట్మాస్ సౌండ్ అంటే ఏంటి? అనే విషయాలు చాలామందికి తెలియదు.

సౌండ్ టెక్నాలజీకి సంబంధించిన పదమే డాల్బీ. అట్మాస్ అంటే.. ఆ సౌండ్ టెక్నాలజీని ఉపయోగించి.. చుట్టుపక్కన సౌండ్ వేవ్స్‌ను పంపించడం. 3డీ ఆబ్జెక్ట్ ద్వారా ఒక ఇల్యూషన్‌ను క్రియేట్ చేసి.. సౌండ్‌ను వ్యాపింపజేయడమే డాల్బీ అట్మాస్ పని.

డాల్బీ అట్మాస్ సౌండ్ ఎలా పనిచేస్తుందంటే?
సాధారణంగా.. పాత సౌండ్ టెక్నాలజీలు.. చానెల్స్‌ను బేస్ చేసుకొని పనిచేస్తాయి. చానెల్స్ ద్వారా సౌండ్‌ను ప్రసారం చేస్తాయి. ఏదైనా ఒక్క చానెల్లో సమస్య ఉన్నా.. సౌండ్ క్లారిటీ దెబ్బతింటుంది. అదే.. డాల్బీ అట్మాస్ మాత్రం ఆడియోను ఆబ్జెక్ట్స్‌గా క్రియేట్ చేస్తుంది. ఆ ఆబ్జెక్ట్‌లో మెటాడేటా ఉంటుంది. ఆ మెటాడేటాను కంపాటిబుల్ డివైజ్‌లు యాక్సెస్ చేసుకొని.. దానికి తగ్గట్టుగా బెస్ట్ ఆడియోను అందిస్తాయి.

హైట్స్‌ను బేస్ చేసుకొని ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ఎత్తైన చానెల్స్‌ను బేస్ చేసుకొని.. సౌండ్‌లో ఎక్కువ క్లారిటీ, మ్యూజిక్‌లో డెప్త్‌ను క్రియేట్ చేస్తుంది. అందుకే.. స్పీకర్స్‌ను ఎత్తులో పెడితే.. డాల్బీ అట్మాస్ సిస్టమ్ బెటర్‌గా వర్క్ అవుతుంది. అలాగే.. బెస్ట్ డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేసే ఆడియో సిస్టమ్ ఉంటేనే.. అది సరిగ్గా పనిచేస్తుంది.

ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, టీవీలు, హెడ్‌ఫోన్స్‌లో కూడా డాల్బీ వర్క్ అవుతోంది. దీని వల్ల.. 360 డిగ్రీల ఆడియోను కూడా ఎక్స్‌పీరియెన్స్ చేయొచ్చు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్‌తో మూవీస్, వీడియోలను రిలీజ్ చేస్తున్నాయి. అలాగే.. 4కే రిజల్యూషన్‌తో వచ్చే వీడియోలన్నీ.. డాల్బీ అట్మాస్‌ను సపోర్ట్ చేస్తాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు పంపిన స్పేస్ఎక్స్..!
Ez4EV : ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మొబైల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
How to Lock Facebook Profile : ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేయడం ఎలా?
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
Youtube : షాకింగ్.. 10 లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణం ఇదే
Koo : కోటి మంది యూజర్ల మార్క్‌కు చేరుకున్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’
Drone Rules 2021 : డ్రోన్లపై ఉన్న ఆంక్షలను తొలగించిన కేంద్రం.. ఇక నుంచి ఈజీ అప్రూవల్ సిస్టమ్
Yahoo News : ఇండియాలో యాహూ షట్‌డౌన్.. ఇక నుంచి యాహూ న్యూస్ కనిపించవు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kumbha | ‘కుంభ’లోని శక్తిని ఇప్పుడే తట్టిలేపాలని అనుకోవడం లేదు.. పృథ్వీరాజ్ బర్త్‌డేపై రాజమౌళి ట్వీట్
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

