అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు పంపిన స్పేస్ఎక్స్..!
SpaceX Launch: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఇవాళ అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు పంపింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) లో ఉన్న ఏడుగురు వ్యోమగాముల

న్యూయార్క్: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ఇవాళ అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు పంపింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం) లో ఉన్న ఏడుగురు వ్యోమగాముల కోసం చీమలు, 2 వేల కేజీలకు పైగా అవకాడోలు, నిమ్మకాయలు, ఐస్ క్రీమ్‌లు, మనిషెత్తు రోబో హ్యాండ్ను పంపించింది. ఈ సరంజామాతో కూడిన డ్రాగన్ క్యాప్సూల్‌ను ఫాల్కన్ రాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టారు. నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఈ ప్రయోగాన్ని నిర్వహించింది.
మొత్తం 4,800 పౌండ్ల బరువైన (2,170 కేజీలు) పరికరాలు, ఇతర సామగ్రిని ఈ ప్రయోగం ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి చేరవేశారు. మంగళవారం ఇవి స్పేస్ స్టేషన్‌కు చేరుకోనున్నాయి. అమెరికాకు చెందిన ‘గర్ల్స్ స్కౌట్స్’ నాసా ద్వారా చీమలను అంతరిక్షంలోకి పంపింది. స్పేస్‌లో వీటిపై ప్రయోగాలు నిర్వహించనుంది. ఉప్పునీటి రొయ్యలు, కొన్ని మొక్కలను సైతం ప్రయోగాల కోసం పంపించింది. విస్కాన్సిన్-మాడిసన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పంపిన విత్తనాలను (జన్యు పరిశోధనలో ఉపయోగించే ఒక చిన్న పుష్పించే మొక్క విత్తనాలు) సైతం డ్రాగన్ క్యాప్సూల్ మోసుకెళ్లింది.
ఇక కాంక్రీట్, సోలార్ సెల్స్, తదితర మెటీరియల్‌ను సైతం ఈ ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి చేరింది. గిటాయ్ ఇంక్ అనే జపాన్ స్టార్టప్ కంపెనీ అభివృద్ధి చేసిన రోబోటిక్ చెయ్యిని అంతరిక్ష కేంద్రంలో వివిధ పరికరాల మరమ్మతులకు వినియోగించనున్నారు. వ్యోమగాములు చేసే ఇతర పనులు కూడా ఇది చేస్తుందని సంస్థ అధికారి టొయోటకా కొజుకి తెలిపారు. ఇలాంటి పరికరాలను మరికొన్ని పంపించనున్నట్లు చెప్పారు. 2025 నాటికి చంద్రుడిపై స్థావరాలు ఏర్పాటు చేసేందుకు ఈ పరికరాలను వినియోగించనున్నట్లు తెలిపారు. చంద్రుడి గర్భంలో ఉన్న విలువైన వనరులను తవ్వి తీసేందుకూ ఈ రోబో పరికరాలను ఉపయోగించనున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

