How to Lock Facebook Profile : ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేయడం ఎలా?
ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేయడం | ఫేస్బుక్లో చేసే ప్రతి అప్డేట్ వల్ల.. ప్రతి పోస్ట్ వల్ల.. యూజర్ల ప్రైవసీకి
ఈ జనరేషన్ వాళ్లకు ఫేస్బుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫేస్బుక్ వాడని వాళ్లు లేరు. ఇండియాలో ఫేస్‌బుక్‌కు కోట్లలో యూజర్లు ఉన్నారు. స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరు తమ చదువుతో సంబంధం లేకుండా ఫేస్‌బుక్‌ను వాడుతున్నారు. ఫేస్బుక్లో పోస్టులు పెడుతూ.. సోషల్ మీడియాతో టచ్‌లో ఉంటున్నారు.

అయితే.. ఫేస్బుక్లో చేసే ప్రతి అప్డేట్ వల్ల.. ప్రతి పోస్ట్ వల్ల.. యూజర్ల ప్రైవసీకి కొంచెం భంగం వాటిల్లే సమస్య అయితే ఉంది. ఎందుకంటే.. ఫేస్బుక్లో ఫ్రెండ్ లిస్టులో లేనివాళ్లు కూడా వేరే వాళ్ల అకౌంట్లోకి వెళ్లి వాళ్ల అప్డేట్స్, పోస్టులు.. వాళ్ల పర్సనల్ ఇన్ఫర్మేషన్ అన్నీ చూడొచ్చు. ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవాళ్లకు అకౌంట్ సమాచారం కనిపిస్తే ఓకే కానీ.. ఫ్రెండ్ లిస్టులో లేనివాళ్లు తమ అకౌంట్, పోస్టులు ఎందుకు చూపించాలి? ఆ ఆలోచన నుంచి వచ్చే లాక్ ప్రొఫైల్.
ఫేస్బుక్లో ఫ్రెండ్స్ లిస్టులో లేనివాళ్లు సదరు అకౌంట్‌ను చూడకుండా ఉంచేదే ప్రొఫైల్ లాక్. యూజర్ తన ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకుంటే కేవలం తన ఫ్రెండ్స్ లిస్టులో ఉన్న యూజర్లు మాత్రమే తన అకౌంట్‌ను చూడగలరు. ఫ్రెండ్ లిస్టులో లేని ఫేస్బుక్ యూజర్లు.. ఆ ఆకౌంట్‌ను ఓపెన్ చేయలేరు. దాని వల్ల ప్రైవసీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.

అయితే.. ప్రొఫైల్‌ను ఎలా లాక్ చేసుకోవాలి? మళ్లీ ప్రొఫైల్ లాక్‌ను తీసేయాలంటే ఎలా? లాంటి విషయాలు చాలామంది ఫేస్బుక్ యూజర్లకు తెలియవు. ఫేస్బుక్ ప్రొఫైల్ లాక్‌ను మొబైల్ యాప్ లేదా డెస్క్‌టాప్ ద్వారా కూడా చేసుకోవచ్చు.
మొబైల్ యాప్ ద్వారా ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?
ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫేస్బుక్ యాప్‌ను ఓపెన్ చేసి.. ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అక్కడ యాడ్ టు స్టోరీ పక్కన మూడు చుక్కలు ఉంటాయి. వాటి మీద క్లిక్ చేస్తే.. లాక్ ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే లాక్ ప్రొఫైల్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో వివరాలు ఉంటాయి. దాన్ని ట్యాప్ చేస్తే ప్రొఫైల్ లాక్ అవుతుంది. భవిష్యత్తులో లాక్ ఆప్షన్ తీసేయాలనుకుంటే.. మళ్లీ లాక్ ప్రొఫైల్ ఆప్షన్‌లోకి వెళ్లి.. దాన్ని ఆఫ్ చేయాల్సి ఉంటుంది.
డెస్క్‌టాప్ ద్వారా ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేసుకోవడం ఎలా?
ఫేస్బుక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి.. లాగిన్ అయ్యాక.. See your profile అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వా మూడు డాట్స్ మీద క్లిక్ చేస్తే.. Lock Profile అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే.. ప్రొఫైల్ లాక్కు సంబంధించిన సమాచారం ఒక పాప్ అప్ విండోలో కనిపిస్తుంది. దాని కింద Lock Your Profile అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే.. You’ve locked your profile అని ఒక మెసేజ్ వస్తుంది. అంతే.. మీ ప్రొఫైల్ లాక్ అయినట్టే.. ప్రొఫైల్ లాక్ అయ్యాక.. ఫ్రెండ్స్ మాత్రమే టైమ్‌లైన్‌లో షేర్ చేసిన పోస్టులను చూడగలుగుతారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
Youtube : షాకింగ్.. 10 లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణం ఇదే
Koo : కోటి మంది యూజర్ల మార్క్‌కు చేరుకున్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’
Drone Rules 2021 : డ్రోన్లపై ఉన్న ఆంక్షలను తొలగించిన కేంద్రం.. ఇక నుంచి ఈజీ అప్రూవల్ సిస్టమ్
Yahoo News : ఇండియాలో యాహూ షట్‌డౌన్.. ఇక నుంచి యాహూ న్యూస్ కనిపించవు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | రాప్తాడు ఘటనపై మంచు మనోజ్ రియాక్షన్.. మహిళల గౌరవం ఇంటి నుంచే మొదలవ్వాలంటూ పిలుపు!
Vande Bharat Sleeper Train | పట్టాలెక్కిన బెంగళూరు-ముంబై వందే భారత్ స్లీపర్ రైలు.. ప్రారంభించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
KTR Tour Photos | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అడుగడుగునా నీరాజనం.. ఫోటోలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

