JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్( JioPhone Next ) స్మార్ట్ఫోన్ ప్రి బుకింగ్స్ వచ్చే వారమే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ జియో, గూగుల్ కలిసి డెవలప్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది.

న్యూఢిల్లీ: ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్( JioPhone Next ) స్మార్ట్ఫోన్ ప్రి బుకింగ్స్ వచ్చే వారమే ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రిలయన్స్ జియో, గూగుల్ కలిసి డెవలప్ చేసిన ఈ స్మార్ట్ఫోన్ చాలా తక్కువ ధరకే అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ గురించి జూన్లో జరిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశంలో చైర్మన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. ఇప్పటికే ప్రిఆర్డర్ల కోసం రిలయన్స్ తమ రిటెయిల్ పార్ట్నర్లతో సంప్రదిస్తున్నట్లు 91మొబైల్స్ వెబ్సైట్ తెలిపింది. సెప్టెంబర్ 10న ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుందని ఏజీఎంలోనే అంబానీ చెప్పారు.
జియోఫోన్ నెక్ట్స్ ధర ఎంత?
జియోఫోన్ నెక్ట్స్ ధరను ఇండియాలో అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే అతి తక్కువ ధర స్మార్ట్ఫోన్గా నిలవబోతోందని జియో చెబుతోంది. అయితే జియోఫోన్ నెక్ట్స్ ధర రూ.3499గా ఉండే అవకాశం ఉన్నట్లు టిప్స్టర్ తెలిపంది. 5.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 11 ఓఎస్, క్వాల్కామ్ క్యూఎం215 ఎస్ఓసీలతో ఈ ఫోన్ వచ్చే అవకాశం ఉంది. 2జీబీ, 3జీబీ ర్యామ్.. 16 జీబీ, 32 జీబీ స్టోరేజ్ కెపాసిటీలతో జియోఫోన్ నెక్ట్స్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

