Drone Rules 2021 : డ్రోన్లపై ఉన్న ఆంక్షలను తొలగించిన కేంద్రం.. ఇక నుంచి ఈజీ అప్రూవల్ సిస్టమ్
రోజురోజుకూ డ్రోన్ కల్చర్ పెరుగుతోంది. దానికి తగ్గట్టుగానే డ్రోన్లపై ఉన్న ఆంక్షలను కేంద్రం సడలిస్తూ వస్తోంది. ఇది వరకు డ్రోన్‌ను తీసుకోవాలంటే.. దానిపై చాలా ఆంక్షలు ఉండేవి. చాలా పర్మిషన్లు తీసుకోవాల్సి వచ్చేది. అప్రూవల్ సిస్టమ్ కూడా చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ.. కేంద్రం తాజాగా Unmanned Aircraft Systems(UAS) Rules, 2021 ను రద్దు చేసి Liberalised Drone Rules, 2021 ను తీసుకొచ్చింది.

ఇక నుంచి డ్రోన్ వినియోగం కోసం తీసుకోవాల్సిన అప్రూవల్ సర్టిఫికెట్స్‌ను కేంద్రం కుదించింది. అలా పర్మిషన్లను సులభతరం చేసింది. భవిష్యత్తులో డ్రోన్ల ద్వారా కార్గో డెలివరీ చేయడం కోసం డ్రోన్ కారిడార్లను కూడా నిర్మిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.
నిజానికి… డ్రోన్లను ఎగురవేయాలంటే.. కొన్ని పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుంది. యూనిక్ ఆథరైజేషన్ నెంబర్, యూనిక్ ప్రోటోటైప్ ఐడెంటిఫికేషన్ నెంబర్, సర్టిఫికెట్ ఆఫ్ మానుఫాక్చరింగ్ అండ్ ఎయిర్ వర్తీనెస్, సర్టిఫికెట్ ఆఫ్ కన్ఫర్మెన్స్, మెయింటెనెన్స్ సర్టిఫికెట్, ఇంపోర్ట్ సర్టిఫికెట్, యాక్సెప్టెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డ్రోన్స్, ఆపరేటర్ పర్మిట్, పైలట్ లైసెన్స్.. ఇలా పలు రకాల లైసెన్స్‌లు 25 వరకు పొందాల్సి ఉండేది. కానీ.. ఇప్పుడు వాటన్నింటినీ తీసేసి.. కేవలం 5 సర్టిఫికెట్లను మాత్రమే యాడ్ చేసింది. అలాగే.. రిమోట్ పైలట్ లైసెన్స్ ఫీజును రూ.3000 నుంచి రూ.100 రూపాయలకు తగ్గించింది. ఒక్కసారి రిమోట్ పైలట్ లైసెన్స్ తీసుకుంటే.. 10 ఏళ్ల వరకు డ్రోన్స్‌ను ఆకాశంలో ఎగురవేసే హక్కు ఉంటుంది.

ఎయిర్ స్పేస్‌కు సంబంధించిన మ్యాప్ Digital Sky website లో లభిస్తుంది. ఆ మ్యాప్‌లో గ్రీన్, ఎల్లో, రెడ్ జోన్స్ ఉంటాయి.
గ్రీన్ జోన్లో డ్రోన్స్ ఎగురవేయడానికి పర్మిషన్ అవసరం లేదు
సాధారణంగా.. వీడియోలు షూట్ చేయడం కోసం, సినిమా షూటింగ్‌ల కోసం డ్రోన్స్ వాడుతుంటారు. గ్రీన్ జోన్లలో డ్రోన్స్‌ను వాడేవాళ్లు ఇక నుంచి ఎటువంటి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గ్రీన్ జోన్ అంటే.. ఎయిర్‌స్పేస్ మ్యాప్‌లో రెడ్ జోన్ లేదా ఎల్లో జోన్‌గా లేని ఏరియాలో 400 ఫీట్లు లేదా 120 మీటర్ల ఎత్తు వరకు డ్రోన్లను ఎగురవేయవచ్చు. అలాగే 200 ఫీట్లు లేదా 60 మీటర్ల ఎత్తులో 8 నుంచి 12 కిలోమీటర్ల పార్శ్వ దూరంలో ఆపరేషనల్ ఎయిర్పోర్ట్ లేకుంటే దాన్ని గ్రీన్ జోన్ అంటారు.

ఎల్లో జోన్‌ను 45 కిలోమీటర్ల నుంచి 12 కిలోమీటర్లకు తగ్గించారు. 12 కిలోమీటర్ల పరిధిలో ఎయిర్‌పోర్టు చుట్టుకొతలను ప్రామాణికంగా తీసుకొని ఆ పరిధిని ఎల్లో జోన్‌గా ప్రకటించారు.
మైక్రో, నానో డ్రోన్లకు రిమోట్ పైలట్ లైసెన్స్ అవసరం లేదు
మైక్రో, నానో డ్రోన్లకు పైలట్ లైసెన్స్ అవసరం లేదు. అయితే.. నాన్ కమర్షియల్ యూజ్ కోసం వాడే మైక్రో, నానో డ్రోన్లకు మాత్రమే పైలట్ లైసెన్స్‌ను కేంద్రం రద్దు చేసింది. కొత్త రూల్స్ ప్రకారం.. ఏదైనా డ్రోన్‌కు లైసెన్స్ తీసుకోవాలన్నా.. రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా.. సెక్యూరిటీ క్లియరెన్స్ అవసరం లేదు.
డ్రోన్స్ రూల్స్ 2021 ప్రకారం.. డ్రోన్స్ కవరేజ్‌ను 300 కిలోల నుంచి 500 కిలోలకు పెంచారు. దీంట్లో డ్రోన్ ట్యాక్సీలను కూడా చేర్చారు. డ్రోన్ ట్రెయినింగ్ రిక్వైర్ మెంట్స్, డ్రోన్ స్కూల్స్ నిర్వహణ, పైలట్ లైసెన్స్ ఆన్లైన్ కు సంబంధించిన విషయాలపై డీజీసీఏ దృష్టి సారించనుంది.
30 నవంబర్ 2021 వరకు కొనుగోలు చేసే డ్రోన్లకు యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్‌ను ఇస్తారు. డిజిటల్ స్కై ప్లాట్‌ఫాం ద్వారా ఆ నెంబర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

