Apply Driving Licence Online : ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లయి చేసుకోవడం ఎలా? ప్రొసీజర్ ఏంటి?
ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్ అప్లయి చేసుకోవడం ఎలా | చాలామంది ఆర్టీవో ఆఫీసుల్లో లైసెన్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మధ్యవర్తుల ప్రమోయం ఉంటేనే.. కొన్నిచోట్ల లైసెన్స్‌లు జారీ చేస్తుంటారు
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడాలి. ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి.. ముందు లర్నర్ లైసెన్స్‌కు అప్లయి చేయాలి.. దాని కోసం ఓ పరీక్ష రాయాలి. అందులో పాస్ అయితేనే లర్నర్ లైసెన్స్ ఇస్తారు. లర్నర్ లైసెన్స్ ఇచ్చాక.. ఆరు నెలల లోపు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. టూవీలర్ అయినా.. ఫోర్ వీలర్ అయినా.. హెవీ వెహికిల్స్ అయినా.. ఏదయినా సరే.. ప్రొసీజర్ మాత్రం ఇదే.

అయితే.. చాలామంది ఆర్టీవో ఆఫీసుల్లో లైసెన్స్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మధ్యవర్తుల ప్రమోయం ఉంటేనే.. కొన్నిచోట్ల లైసెన్స్‌లు జారీ చేస్తుంటారు. కావాలని లర్నర్ లైసెన్స్ పరీక్షలో ఫెయిల్ చేస్తారని అంటారు.
వీటన్నింటికీ చెక్ పెట్టడం కోసమే కేంద్రం.. ఆన్ లైన్ విధానంలో డ్రైవింగ్ లైసెన్స్‌ను అప్లయి చేసుకునే అవకాశాన్ని వాహనదారులకు కల్పించింది. లర్నర్ లైసెన్స్, పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ చేంజ్, రెన్యువల్ లాంటి సర్వీసులకు ఒకే ఒక ఆన్లైన్ పోర్టల్ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది.
పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లయి చేయాలనుకుంటే.. ముందు లర్నర్ లైసెన్స్ కోసం అప్లయి చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లయి చేయాలి.
ఆన్లైన్లో అప్లయి చేయండిలా
దానికోసం.. https://parivahan.gov.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి.. Online Services అనే ట్యాబ్ ఓపెన్ చేయాలి. దాంట్లో Driving License Related Services.. ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు వేరే పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ రాష్ట్రాన్నిసెలెక్ట్ చేసుకోవాలి. ఆన్లైన్లో లైసెన్స్ అప్లయి చేసుకునే విధానం ప్రస్తుతానికి కొన్ని రాష్ట్రాల్లోనే అందుబాటులో ఉంది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల నిబంధనలకు అనుగుణంగానే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
స్టేట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మరో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Apply for Learner Licence, Apply for Driving Licence, DL Renewal, Duplical DL, change of Address etc.. లాంటి సర్వీసులు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏ సర్వీసు కావాలో దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.

అయితే.. ఇక్కడ రెండు విషయాలు గుర్తు పెట్టుకోవాలి. ఆధార్ నెంబర్‌తో ఈకేవైసీని ఆన్లైన్లోనే వెరిఫై చేస్తే.. లర్నింగ్ టెస్ట్ కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంట్లోనే కూర్చొని ఆన్ లైన్ టెస్ట్ రాయొచ్చు. ఒకవేళ నాన్ ఆధార్ ఈకేవైసీ పద్ధతిని ఎంచుకుంటే మాత్రం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లి పరీక్ష రాయాల్సి ఉంటుంది.
ఫామ్ మొత్తాన్ని నింపి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లర్నర్ లైసెన్స్ టెస్ట్‌కు సంబంధించిన వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో పంపిస్తారు. ఆ సమయానికి ఆన్ లైన్లో లేదా ఆఫ్‌లైన్‌లో పరీక్ష రాయాల్సి ఉంటుంది. అందులో పాస్ అయితే.. లర్నర్ లైసెన్స్‌ను వెంటనే ఇష్యూ చేస్తారు. ఆ తర్వాత 6 నెలల లోపు పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లయి చేసుకోవల్సి ఉంటుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : How to Lock Facebook Profile : ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేయడం ఎలా?
JioPhone Next: వచ్చే వారమే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్!
Youtube : షాకింగ్.. 10 లక్షల వీడియోలను తొలగించిన యూట్యూబ్.. కారణం ఇదే
Koo : కోటి మంది యూజర్ల మార్క్‌కు చేరుకున్న దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’
Drone Rules 2021 : డ్రోన్లపై ఉన్న ఆంక్షలను తొలగించిన కేంద్రం.. ఇక నుంచి ఈజీ అప్రూవల్ సిస్టమ్
Yahoo News : ఇండియాలో యాహూ షట్‌డౌన్.. ఇక నుంచి యాహూ న్యూస్ కనిపించవు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

