ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
ATA bathukamma celebrations | మెల్బోర్న్ నగరంలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. పూలతో గౌరమ్మను పేర్చి, ఆటపాటలతో ఆడబిడ్డలంతా కలిసి ఆస్ట్రేలియా గడ్డపై తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు.
ATA bathukamma celebrations | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాలుగా ఆస్ట్రేలియాలో ఘనంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది మెల్బోర్న్ నగరంలో ఏకంగా 6000 మందికి పైగా తెలంగాణ బిడ్డల సమక్షంలో బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా, ఘనంగా నిర్వహించారు. పూలతో గౌరమ్మను పేర్చి, ఆటపాటలతో ఆడబిడ్డలంతా కలిసి ఆస్ట్రేలియా గడ్డపై తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు.
ఆస్ట్రేలియా బీఆర్ఎస్ ఎన్ఆర్ ఐ నాయకుడు అనిల్ బైరెడ్డి మాట్లాడుతూ..”ఆస్ట్రేలియా గడ్డపై మన తెలంగాణ సంప్రదాయాన్ని, బతుకమ్మ సంస్కృతిని గత 13 సంవత్సరాలుగా కొనసాగిస్తూ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో మొట్టమొదటిగా ఈ సంఘాన్ని నేను స్థాపించినందుకు నాకు ఎంతో గర్వంగా, ఆనందంగా ఉంది. ప్రవాసంలో ఉన్నా మన సంస్కృతిని మరిచిపోకుండా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అని తెలియజేశారు.
ఆస్ట్రేలియా బీఆర్ఎస్ ఎన్ఆర్ ఐ నాయకురాలు కిరణ్ పాల్వాయి మాట్లాడుతూ..”ఇంత అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలను జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేడుకలకు ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన మన తెలంగాణ బిడ్డలందరికీ అనుకూలంగా ఉండేలా, మన తెలంగాణ పిండి వంటలు, సంప్రదాయ వంటకాలన్నీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అందరికీ అందించడం చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి పాల్గొనడం విశేషం. ఆమె బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఆడి, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలను విజయవంతం చేయడంలో ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ సభ్యులు రాజ్ వుల్పాల, పుల్లా రెడ్డి, వంశీ కొట్టాల, మహేష్ బద్దం, ప్రవీణ్ దేశం, అమర్ అత్తాపురం, కృష్ణ వాడియాల, రవి దామెర, దీపక్, రఘు కొట్లా, మధు పర్సా, మధు పైళ్ల, రమేష్ ముత్యాల, సత్య గుండ, శ్యామ్, కార్తీక్, శ్రీకాంత్ నంగునూరి, రాజేష్, ఫణి, సతీష్, పరి, కర్ర శ్రీనివాస్, కిషోర్ యన్నం తదితరులు కృషి చేశారు.


Read Also :
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ATA bathukamma celebrations | ఆస్ట్రేలియా గడ్డపై అంగరంగ వైభవంగా.. 6 వేల మందితో మెల్బోర్న్ లో బతుకమ్మ వేడుకలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Suicide | పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
NHM Employees | ఉరి తాళ్లతో ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
Ambarkishore jha | బాధితులకు న్యాయం చేయడమే పోలీసుల లక్ష్యం: రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా
ట్రెండింగ్ వార్తలు
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!

