Thalasani Srinivas Yadav | సద్దుల బతుకమ్మలో స్టెప్పులతో అదరగొట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్
Thalasani Srinivas Yadav | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ పండుగ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Thalasani Srinivas Yadav | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే పండుగ బతుకమ్మ పండుగ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బతుకమ్మ వేడుకలలో భాగంగా ఆదివారం రాత్రి నెక్లెస్ రోడ్ లోని కర్బలా మైదానంలో ఎమ్మెల్యే తలసాని ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వేలాది మంది మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో కర్బలా మైదానంకు వచ్చారు. బతుకమ్మ పాటలు, ఆడపడుచుల ఆటలతో నెక్లెస్ రోడ్ పరిసరాలు ఎంతో కోలాహలంగా మారాయి. పాటలకు దీటుగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మహిళలతో కలిసి బతుకమ్మ, దాండియా ఆడారు.
తలసాని శ్రీనివాస్ యాదవ్ గతంలో కన్నా విభిన్నంగా మాస్ డ్యాన్స్ తో అదరగొట్టారు. మహిళలు, యువతులు సైతం ఎమ్మెల్యేతో కలిసి స్టెప్పులు వేశారు. రంగురంగుల లైట్ల వెలుతురులో, బతుకమ్మ, పోక్ సాంగ్స్ కు అనుగుణంగా మహిళలు, యువతులు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా అర్ధరాత్రి దాటే వరకు బతుకమ్మను ఆడారు. వేడుకలలో మాజీ కార్పొరేటర్ లు అత్తిలి మల్లిఖార్జున్ గౌడ్, అత్తిలి అరుణ గౌడ్, టి. మహేశ్వరి, బి ఆర్ ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, గందే నాగులు, కిషోర్, శ్రీహరి, కోటేశ్వర్ గౌడ్, భువనగిరి కిరణ్ గౌడ్, రాంమోహన్ యాదవ్, ధరం చౌదరి, శ్రీకాంత్, టీనా గౌడ్, ఆరీఫ్, కొత్తూరు వెంకట్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | సింగపూర్‌లో ఘనంగా బతుకమ్మ – 2026 వేడుకలు
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ సునామీ.. మూడు రోజుల్లోనే రూ.317 కోట్లకు పైగా వసూళ్లు!
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

