Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Y.S. Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టం నామినేషన్ల పర్వం ప్రారంభం రోజునే రాష్ట్రంలోని పలు ప్రాంతాల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ( Local Body Elections ) ఎన్నికల ప్రక్రియలో మొదటి ఘట్టం నామినేషన్ల పర్వం ప్రారంభం రోజునే రాష్ట్రంలోని పలు ప్రాంతాల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల కేంద్రం వద్ద కూటమి, వైసీపీ నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. పుంగనూరులో వైసీపీ( YCP ) , కూటమి శ్రేణుల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రాగా ఇరువరు దాడులకు దిగారు.
వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ( MP Mithun Reddy ) కాన్వాయ్‌పై రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. నామినేషన్ కేంద్రం వద్ద నుంచి మిథున్‌రెడ్డిని పోలీసులు తరలించారు. ఈ ఘటనపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండించారు.ఫోన్లో మిథున్‌రెడ్డిని పరామర్శించారు. టీడీపీ నాయకులు పోలీసులను వాడుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఎన్నికలు సజావుగా జరపాలన్న ఉద్దేశం చంద్రబాబుకు ఏమాత్రం లేదని పేర్కొన్నారు. తీవ్ర ప్రజా వ్యతిరేకత నడుమ ఓడిపోతారనే తెలిసే దాడులను ప్రోత్సహిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడికే భద్రతా లేని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయని అన్నారు. దాడులు జరుగుతుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని, కూటమి అన్యాయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని వెల్లడించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

