ఒక్కొక్కరిదీ ఒక్కో ఫోన్, ఒక్కో తరహా చార్జర్. యూఎస్బీ ఉండేవి కొన్నయితే, సీ టైప్ పిన్‌తో పనిచేసేవి మరికొన్ని. ఐఫోన్ చార్జర్ మరో రకం. ఇంట్లోని నలుగురూ ఊరికి వెళ్లాలంటే నాలుగు రకాల చార్జర్లు తీసుకెళ్లాల్సిందే. కానీ ఆ సమస్యను తీర్చేందుకు వచ్చిందే ‘సిస్కా జీఎన్ 65 సీఆర్ గన్ ప్రొ ట్రావెల్ అడాప్టర్’. ఇందులో రెండు సీ టైప్ చార్జింగ్ పాయింట్లు, ఒక ఎ టైప్ యూఎస్బీ పోర్టు ఉంటాయి. కాబట్టి మన దగ్గర ఏ ఫోన్ ఉన్నా చార్జింగ్ పెట్టుకోవచ్చు.. అది కూడా మూడు గ్యాడ్జెట్లు ఒకేసారి. అధిక ఓల్టేజీ, ఉష్ణోగ్రతల నుంచి ఆయా పరికరాలను రక్షించే విధంగా రూపొందించారు. flipkart.com, syska.co.in ద్వారా కొనుక్కోవచ్చు. ధర రూ. 1,799.
సాంకేతికత మారేకొద్దీ రోజువారీ జీవితాల్లో వాడే వస్తువుల్లోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. అందులో ఫ్యాన్లూ ఉన్నాయి. అవి కూడా గడగడా చప్పుడు చేయకుండా చాలా నిశ్శబ్దంగా, ఎంతో వేగంగా తిరుగుతున్నాయి.
‘ఓరియెంట్ ఏరోక్వైట్ బీఎల్డీసీ ఫ్యాన్’ అలాంటిదే. ఇది బ్రష్‌లెస్ డైరెక్ట్ కరెంట్ టెక్నాలజీతో (అంటే ఈ రకం ఫ్యాన్‌లోని కాయిల్స్ తిరగవు) పనిచేస్తుంది. ఫలితంగా, సాధారణ ఫ్యాన్కన్నా ఎక్కువ ప్రాంతానికి గాలి వీస్తుంది. చప్పుడు అతి తక్కువ. చూసేందుకు ఫ్యాషనబుల్‌గా ఉంటుంది. విద్యుత్ వినియోగమూ తక్కువే. ఇందులోని ఇన్వర్టర్ స్టెబిలైజర్ టెక్నాలజీ వల్ల లో ఓల్టేజీ అయినా హై ఓల్టేజీ అయినా ఫ్యాన్ తిరిగే వేగం సమంగా ఉంటుంది. orientelectric.comలో కొనుగోలు చేయవచ్చు. ధర పదివేల రూపాయల పైచిలుకు.
రోజూ బూట్లు వేసుకునే అలవాటు ఉన్నవాళ్లకు స్నీకర్స్‌ను మించిన ఎంపిక ఉండదు. అందులోనూ కాస్త విభిన్నంగా, సౌకర్యంగా ఉండేలా తయారు చేస్తున్నది ఎవర్‌లేన్ సంస్థ. ఇటీవల ‘ద ట్రెడ్-బేర్ స్నీకర్స్’ పేరిట మార్కెట్లోకి తీసుకువచ్చిన బూట్లు తేలికపాటివనీ, నిత్య జీవితంలో ధరించేందుకు బాగా పనికొస్తాయనీ తయారీదారు చెబుతున్నది. మళ్లీ మళ్లీ వినియోగించడానికి వీలున్న నూలు, హీవియా చెట్ల పాలతో వీటిని చేస్తున్నారు. దీనివల్ల తయారీ ప్రక్రియలో అతి తక్కువ కార్బన్ డై ఆక్సైడ్ విడుదల అవుతుంది. రూ. 19,500 విలువైన ఈ బూట్లను everlane.comలో విక్రయిస్తున్నారు.
ఇప్పుడు టాప్‌నే జాకెట్గానూ వేసుకుంటున్నారు. క్రాప్టాప్గానూ వాడుతున్నారు. అందుకే నచ్చినట్టు మ్యాచ్ చేసుకో గలిగేలా టాప్‌లను రూపొందిస్తున్నారు డిజైనర్లు. ‘కలర్ బ్లాక్డ్ టెక్చర్ బిబ్ టాప్’ అలాంటిదే. కాటన్, చందేరీ సిల్క్ కలబోతగా రూపొందిన ఈ టాప్కు ముందువైపు ఒక బటన్ ఉంటుంది. పక్కలకు మాత్రం ఫ్యాషనబుల్‌గా తాళ్లు కట్టుకునే వెసులుబాటు ఉంటుంది. డ్రెస్ మీద కోట్లా, చీరల మీద జాకెట్గానూ ఉపయోగించుకోవచ్చు. విభిన్న రంగుల్లో రూపొందుతున్న ఈ టాప్‌ను Swgt.in ద్వారా కొనుగోలు చేయవచ్చు. ధర రూ.15,200.
“Ring AIR | ఈ చిన్న రింగ్ మీ ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పేస్తుంది!”
“Naya Mall | డెనిమ్ నుంచి వచ్చిన ఈ నయా ఫ్యాషన్ డ్రెస్సులు కచ్చితంగా మీ మనసు దోచేస్తాయి”