e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 24, 2021
Home News 2021హోండా గోల్డ్ వింగ్‌… ఫీచర్స్ అదుర్స్ …

2021హోండా గోల్డ్ వింగ్‌… ఫీచర్స్ అదుర్స్ …

2021హోండా గోల్డ్ వింగ్‌… ఫీచర్స్ అదుర్స్ …

ముంబై ,జూన్ 12: హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా భారత మార్కెట్లో మరో సరికొత్త బైక్ ను తీసుకురానుంది. త్వరలో బిఎస్ 6 గోల్డ్ వింగ్ బైక్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకానికి ఉన్న 2021 హోండా గోల్డ్ వింగ్‌ ను అత్యాధునిక ఫీచర్లతో రూపొందించింది.

2021 హోండా గోల్డ్ వింగ్‌ బైక్‌లో ఫీచర్లివే …

- Advertisement -

-1,833 సిసి, లిక్విడ్-కూల్డ్, ఇన్లైన్-6 ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 126.4 బిహెచ్‌పి పవర్ 170 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ మాన్యువల్ , 7 స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో స్లిప్పర్ క్లచ్ స్టాండర్డ్ గా లభిస్తుంది.

-7.0 ఇంచెస్ టిఎఫ్‌టి ఇన్‌స్టాన్స్ ట్రూ కన్సోల్‌తో పాటు ఆపిల్ కార్ ప్లే , ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటివి ఉన్నాయి.ఇందులో గైరోకాంపాస్ నావిగేషన్, స్మార్ట్ కీ, ఎలక్ట్రానిక్ అడ్జస్టబుల్ విండ్‌స్క్రీన్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఐడిల్ స్టార్ట్-స్టాప్ సిస్టమ్ , ఆల్-ఎల్ఇడి లైటింగ్ వంటివి ఉన్నాయి.

-ఈ లగ్జరీ హోండా గోల్డ్ వింగ్ బైక్‌లో స్పోర్ట్, రెయిన్, టూర్, ఎకో అనే ఫోర్ రైడింగ్ మోడ్‌లు లభిస్తాయి. 2021 గోల్డ్ వింగ్ బైక్ చూడటానికి చాలా పెద్దదిగా ఉంటుంది. ఈ బైక్ స్టెప్డ్ సీట్లను కూడా కలిగి ఉంటుంది, కావున లాంగ్ డ్రైవ్ లో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

-2021 హోండా గోల్డ్ వింగ్ బైక్ అల్ట్రా ప్రీమియం బైక్. ఈ బైక్ సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే, దీని ముందు భాగంలో డబుల్-విష్బోన్ , వెనుక వైపు ప్రో-లింక్ సెటప్ కలిగి ఉంది. ఇది ఎలక్ట్రిక్ కంట్రోల్ సస్పెన్షన్-డంపింగ్ అనుకూలతను కలిగి ఉంది.

బ్రేకింగ్ సిస్టమ్ విషయానికొస్తే, ఈ లగ్జరీ బైక్ ముందు భాగంలో 6 పిస్టన్ కాలిపర్‌లతో కూడిన ట్విన్ 320 మిమీ డిస్క్ , వెనుకవైపు త్రీ పిస్టన్ కాలిపర్‌తో ఒకే 316 మిమీ డిస్క్‌ను కలిగి ఉంది.

  • మెరుగైన భద్రత కోసం ఇది ఏబీఎస్ తో ఎలక్ట్రిక్ కంట్రోల్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
2021హోండా గోల్డ్ వింగ్‌… ఫీచర్స్ అదుర్స్ …
2021హోండా గోల్డ్ వింగ్‌… ఫీచర్స్ అదుర్స్ …
2021హోండా గోల్డ్ వింగ్‌… ఫీచర్స్ అదుర్స్ …

ట్రెండింగ్‌

Advertisement