నవతరం పుస్తక ప్రియులకు ఐపాడ్, కిండిల్ ఈ-రీడర్ ఉండాల్సిందే. అయితే ఇదే తరహాలో నచ్చిన పుస్తకాన్ని వీలుని బట్టి సులభంగా చదువుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ‘ఎస్ఓఐ రీడర్ గ్లాసెస్’. ఐ-ఇంక్ టెక్నాలజీతో పనిచేసే ఈ కళ్ల జోడులోపల కిండిల్ తరహాలో పుస్తకాల పేజీలను చూపిస్తాయి. జూమ్ చేసుకుని చదువుకోవచ్చు. పెద్ద గ్యాడ్జెట్లను మోసుకెళ్లే పని లేకుండా ఎటైనా వెళ్లినప్పుడు వీటిని తీసుకెళ్తే సరి. సాధారణ సన్‌గ్లాసెస్ అంత బరువు ఉంటాయి. ఒకసారి చార్జింగ్ పెడితే 25 గంటల దాకా చదువుకోవచ్చు. soIreader.com లో ఆర్డర్ చేయవచ్చు. ధర రూ.28,700.
ఏసీలో ఉష్ణోగ్రత పెంచి, తగ్గించడానికి రిమోట్ ఉపయోగిస్తాం. కానీ, మనం ఎక్కడున్నా ఎయిర్ కండిషనర్ను నియంత్రించగలిగేలా, సాధారణ ఏసీని కూడా స్మార్ట్‌గా మార్చుకునేందుకు సాయపడుతుంది ‘బోల్డర్ క్లీమా స్మార్ట్ హోమ్ ఎయిర్ కండిషనర్ కంట్రోలర్’. అరచేతి పరిమాణంలోని ఈ పరికరం వైఫై ద్వారా ఫోన్‌కు అనుసంధానం అవుతుంది. ఏసీ రిమోట్‌ను ఈ పరికరం వైపు ఉంచి నొక్కితే.. ఆ సిగ్నల్‌ను రిజిస్టర్ చేసుకుంటుంది. ఇక ఈ పరికరాన్ని ఉపయోగించి మన ఫోన్ ద్వారా ఏసీని నియంత్రించవచ్చు. ఇందులోని ప్రత్యేక సెన్సర్ల్ల కారణంగా.. గదిలో ఎవరూ లేకపోతే ఏసీ దానంతట అదే ఆఫ్ అవుతుంది. ఎవరైనా రాగానే ఆన్ అయిపోతుంది. అంతేకాదు, గదిలో ఏదైనా కిటికీ తెరిచి ఉంటే కూడా ఏసీని ఆపేస్తుంది. బయటి వాతావరణాన్ని బట్టి గది ఉష్ణోగ్రతను సర్దుబాటు చేయడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గిస్తుంది. klima.com వెబ్సైట్లో ఆర్డర్ ఇవ్వొచ్చు. ధర రూ.8,000 పైమాటే!
ఫిట్నెస్ మార్కెట్లో రిస్ట్‌బ్యాండ్స్ స్థానాన్ని స్మార్ట్ వాచీలు ఆక్రమించాయి. బోల్ట్ సంస్థ ఇటీవల ‘స్ట్రైకర్ ప్లస్’ పేరిట సరికొత్త మాడల్‌ను తీసుకువచ్చింది. 1.39 అంగుళాల గుండ్రటి వాచీలో ఫిట్నెస్ వర్కవుట్స్‌కు సంబంధించి 120 రకాల మోడ్‌లను సెట్ చేసుకోవచ్చు. అంటే రన్నింగ్, సైక్లింగ్, క్రికెట్, బాస్కెట్ బాల్, యోగా.. ఇలా విభిన్న రకాల వ్యాయామాలకు సంబంధించిన మోడ్‌లను పెట్టుకోవచ్చు. రక్తంలో ఆక్సిజన్ స్థాయులు, గుండె కొట్టుకొనే వేగం, బీపీలాంటి వాటినీ చూసుకోవచ్చు. అలారం, టైమర్, స్టాప్ వాచ్‌లాంటి ఆప్షన్లూ ఉన్నాయి. ఫోన్ కాల్స్‌లో సాయానికి సిరి, గూగుల్ అసిస్టెంట్లను వాడుకోవచ్చు. నీలం, పచ్చ, తెలుపు, నలుపు.. ఇలా వివిధ రంగుల్లో దొరుకుతున్నాయి. boultaudio.com లో షాపింగ్ చేసుకోవచ్చు. ధర రూ.1,299.
ప్రయాణాల్లో.. బయటికి వెళ్లే సమయంలో.. ఫోన్ చార్జింగ్ పెట్టుకునేందుకు పవర్ బ్యాంక్ వాడతాం. అయితే పవర్‌బ్యాంక్‌లో ఛార్జింగ్ ఎంత ఉంది అనేది తెలుసుకోవడం కష్టమే. మనకు ఆ వెసులుబాటును కల్పిస్తుంది
‘ప్రొమేట్ టార్క్ 10’. ఇందులోని ప్రత్యేక చార్జింగ్ టెక్నాలజీ మనం ఏ పరికరాన్ని అనుసంధానం చేశామన్నది గుర్తించి.. ఆ సామర్థ్యానికి తగ్గట్టు విద్యుత్తును ప్రవహింపజేస్తుంది. ఈ పవర్ బ్యాంక్‌తో ఒకేసారి రెండు పరికరాలను చార్జ్ చేసుకోవచ్చు. అందులో ఎంత చార్జింగ్ మిగిలి ఉందన్నది ఎల్యీడీ డిస్ప్లేలో చూపేలా రూపొందించారు. ఫాస్ట్ ఛార్జింగ్ ఈ పరికరంలోని మరో ప్రత్యేకత. వివిధ రంగుల్లో దొరుకుతున్నది. అమెజాన్‌లో ఆర్డర్ చేయవచ్చు. ధర రూ. 1,879.
“Ring AIR | ఈ చిన్న రింగ్ మీ ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పేస్తుంది!”
“Naya Mall | డెనిమ్ నుంచి వచ్చిన ఈ నయా ఫ్యాషన్ డ్రెస్సులు కచ్చితంగా మీ మనసు దోచేస్తాయి”