ఇంటర్నెట్ అపోకలిప్స్.. అంటే ఏంటో తెలుసా? ఇంటర్నెట్కు ఇక బైబై చెప్పేయడం. దాన్నే ఇంటర్నెట్ యుగాంతం అంటాం. అంటే.. ఇక ఇంటర్నెట్ను ఉపయోగించే చాన్స్ ఉండదు అని అర్థం. అసలు.. ఇంటర్నెట్ లేని ఈ ప్రపంచాన్ని మనం చూడగలమా? కానీ.. భూమి వైపు దూసుకొస్తున్న భారీ సౌర తుఫానును చూస్తే మాత్రం అది నిజమే అని అనిపిస్తుంది.
కాలిఫోర్నియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇటీవల ఇంటర్నెట్ అపోకలిప్స్ మీద ఓ పేపర్‌ను ప్రజెంట్ చేశారు. అంటే ఇంటర్నెట్ యుగాంతం అనేది భూమిని సమీపిస్తున్న సౌర తుఫాను వల్ల జరిగే ప్రమాదం ఉంది.. అంటూ వెల్లడించారు.
డేటా కమ్యూనికేషన్ కాన్ఫరెన్స్ SIGCOMM 2021లో ఇండియాకు చెందిన ఈ ప్రొఫెసర్ సంగీత అబ్దు జ్యోతి సోలార్ సూపర్ స్టార్మ్స్ మీద ప్రజంటేషన్ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా ఇంటర్నెట్కు యుగాంతం అని చెప్పలేం కానీ.. దీన్ని ఒక బ్లాక్ఔట్గా ఆమె అభివర్ణించారు. భారీ సౌర తుఫాను వల్ల.. ఇంటర్నెట్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని.. అది కొన్ని గంటలు కావచ్చు. కొన్ని రోజులు కావచ్చు.. అని ఆమె చెప్పుకొచ్చారు.
ఇంటర్నెట్కు అంతరాయం కలగడం అనేది పలు విధాలుగా ఉంటుందని.. సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్ సౌర తుఫాను వల్ల తీవ్రంగా దెబ్బతిని.. ఇంటర్నెట్కు అంతరాయం కలిగిస్తాయని తన ప్రజెంటేషన్‌లో తెలిపారు.
భారీ సౌర తుఫాను.. ఇదివరకు 1859 లో, 1921 లో భూమి వైపు దూసుకొచ్చింది. 1989లో కూడా ఓ మాదిరి సౌర తుఫాను భూమి మీదికి వచ్చింది. సౌర తుఫాను వల్ల.. సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతాలు ఎక్కువగా ప్రభావానికి గురవుతాయి. అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాల గుండా వెళ్లే ఇంటర్నెట్ కేబుల్స్ ఈ సౌర తుఫాను వల్ల ఎక్కువగా డ్యామేజ్ అయి ఇంటర్నెట్కు భారీ అంతరాయం కలుగుతుందని ఆమె తన పేపర్లో పేర్కొన్నారు.
2/ A Coronal Mass Ejection (CME) involves the emission of electrically charged matter and accompanying magnetic field into space. When it hits the earth, it interacts with the earth's magnetic field and produces Geomagnetically Induced Currents (GIC) on the crust.
— Sangeetha Abdu Jyothi (@sangeetha_a_j) July 29, 2021
[Image: NASA] pic.twitter.com/BO910bko5S
అయితే.. గత జులైలో కూడా సౌర తుఫాను భూమి వైపు ముంచుకొస్తుందని వార్తలు వచ్చాయి. నాసా శాస్త్రవేత్తలు సౌర తుఫానును ఢీకొట్టబోతుందని చెప్పారు. దాని వల్ల.. జీపీఎస్ సిస్టమ్, మొబైల్స్ నెట్ వర్క్స్, శాటిలైట్స్ మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. కానీ.. అటువంటి పరిస్థితులు అయితే రాలేదు.
4/ But what are the chances of this happening?
— Sangeetha Abdu Jyothi (@sangeetha_a_j) July 29, 2021
The estimates range from 1.6 to 12% probability per decade.
But there is more to it. Solar activity waxes and wanes in cycles of ~11 yrs. During solar maxima, there is an increased prob. of CMEs occurring.
6/ By chance, modern technological advancement coincided with a period of weaker solar activity.
— Sangeetha Abdu Jyothi (@sangeetha_a_j) July 29, 2021
In short, we have NO IDEA how resilient the current Internet infrastructure is against the threat of CMEs!
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి : Dolby Atmos : డాల్బీ అట్మాస్ సౌండ్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది?
అంతరిక్షంలోకి చీమలు, అవకాడోలు పంపిన స్పేస్ఎక్స్..!
Ez4EV : ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మొబైల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
How to Lock Facebook Profile : ఫేస్బుక్ ప్రొఫైల్‌ను లాక్ చేయడం ఎలా?