కొత్త ఏడాది కానుకగా.. వినూత్నమైన గడియారాలను తీసుకొచ్చింది ఆభరణాల తయారీ సంస్థ ‘స్వరోస్కీ’. ‘మిలేనియా పాకెట్ వాచ్’ పేరుతో ఇది అందుబాటులోకి వచ్చింది. పొడవాటి చైన్ జతచేసిన పెండెంట్‌లా ఉండే ఈ వాచీని చేతికి బ్రేస్లెట్లా, మెడలో గొలుసులా ధరించవచ్చు. ైస్టెలిష్ లుక్ కోసం ప్యాంట్‌కు, బెల్ట్‌కు తగిలించుకోవచ్చు. ఆడ, మగ.. ఇద్దరికీ వేర్వేరు డిజైన్లు, రంగుల్లో లభిస్తాయి. ధర రూ.26 వేలు. వివరాలకు.. Swarovski.com.
శుభకార్యం ఏదైనా గ్రాండ్లుక్లో కనిపించాల్సిందే. డిజైనరీ దుస్తులు ధరించాల్సిందే. అయితే ఆ డ్రెస్‌కు తగిన జోళ్లను ధరిస్తేనే అలంకరణ పూర్తవుతుంది. కాబట్టే, మిర్రర్ వర్క్‌తో అందమైన పాదరక్షలను తయారుచేసింది ‘5 ఎలిమెంట్స్’ సంస్థ. అచ్చంగా చేతితో తయారుచేసిన ఈ జోళ్లకు అద్దాలు అద్దడంతోపాటు, లేసులనూ జోడించారు. లోపల గోల్డ్ కలర్ లెదర్ కోటింగ్‌తో సౌకర్యంగా ఉండేలా జాగ్రత్తపడ్డారు. రంగురంగుల ఎంబ్రాయిడరీతో ముచ్చటగా ఉన్న ఈ జోళ్ల ధర రూ. 3,990. మరిన్ని ఫొటోల కోసం www.5-elements.co.in చూడవచ్చు.
విలాసవంతమైన నివాసాల్లో బార్ సెటప్ సర్వసాధారణం. కానీ, ఆ వ్యవస్థ గురించి పిల్లలకు తెలియకుండా.. మామూలు సమయాల్లో బీరువాలా దర్శనమిచ్చే ‘ఆర్టిమిస్ లెదర్ బార్’ ఇది. దీన్ని ఇంట్లో ఏ మూలనైనా పెట్టుకోవచ్చు. లెదర్ ఇంటీరియర్‌తో గ్లాసులు, బాటిళ్లు పెట్టేందుకు వేరువేరు అరలు ఉన్నాయి. అంతేకాదు 360 డిగ్రీల ఫ్రీ వీల్
సదుపాయంతో ఒక గది నుంచి మరో గదికి.. తేలికగా తీసుకెళ్లవచ్చు. ఈ ఉడ్ అండ్ లెదర్ అల్మరా ఆన్లైన్ ధర రూ. 1,99,000. ఆసక్తి ఉంటే threesixty.life.com చూడవచ్చు.
శ్రావ్యమైన సంగీతం వింటున్నప్పుడు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టే, రకరకాల ఫీచర్లతో కొత్తకొత్త స్పీకర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ‘యుబాన్’ సంస్థ కూడా.. ఎస్పీ-135 పేరుతో ఆటో మెటిక్ సోలార్ చార్జింగ్, టార్చ్, ఫ్యాన్, ఎఫ్ఎమ్ రేడియో, బ్లూటూత్ కనెక్టివిటీతో వినూత్నమైన స్పీకర్‌ను అందుబాటులోకి తెచ్చింది. యూఎస్బీ పోర్ట్ ద్వారా ఫోన్, మెమరీ కార్డును ఈ స్పీకర్‌కు జతచేసి ఇష్టమైన పాటలు ఆలకించవచ్చు. మూడు రంగుల్లో అందుబాటులో ఉన్న ఈ స్పీకర్ ఆన్లైన్ ధర రూ. 1,999. మీకూ కావాలంటే ubon.comలో ఆర్డర్ చేయండి.
“Naya mall | ఈ పవర్‌బ్యాంక్ 30 నిమిషాల్లోనే మొబైల్‌ను ఫుల్ ఛార్జ్ చేస్తుందట !”