ఆదివారం 29 మార్చి 2020
Science-technology - Mar 08, 2020 , 13:11:32

అంతరిక్షంలో పండించిన‌ ఆ ఆకుకూర తినదగినదే: నాసా

అంతరిక్షంలో పండించిన‌ ఆ ఆకుకూర తినదగినదే: నాసా

వాషింగ్టన్‌: అమెరికాలోని నాసాకు చెందిన కెన్నెడీ స్పేస్‌ సెంటర్‌ పరిశోధకులు అంతరిక్షంలో లెట్యూస్‌ (ఒక రకం ఆకుకూర)ను పండించిన సంగతి తెలిసిందే.  సుమారుగా 2 నెలల పాటు ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌ (ఐఎస్‌ఎస్‌)లో సైంటిస్టులు భూమిని పోలిన వాతావరణ పరిస్థితులను సృష్టించి లెట్యూస్‌ను పండించారు. అయితే ఆ ఆకుకూరపై పరిశోధనలు చేసిన సైంటిస్టులు తాజాగా వివరాలను వెల్లడించారు. 

అంతరిక్షంలో పండించిన లెట్యూస్‌ తినదగినదే అని, భూమిపై పండించిన ఆ ఆకుకూరకు, అంతరిక్షంలో పండింన ఆకుకూరకు పెద్ద తేడా ఏమీ లేదని, పోషక విలువలు రెండింటిలోనూ సమానంగా ఉన్నాయని సైంటిస్టులు తెలిపారు. ఈ క్రమంలో ఆ లెట్యూస్‌పై మరిన్ని పరిశోధనలు చేసి త్వరలోనే అంతరిక్షంలో టమాటాలు, మిరియాలు పండించాలని సైంటిస్టులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇప్పటి వరకు వ్యోమగాములు అంతరిక్షంలో ప్యాక్డ్‌ ఫుడ్‌ను తీసుకుంటుండగా, తాజా ఆవిష్కరణతో ఇకపై వారు అక్కడ పోషక విలువలు కలిగిన తాజా కూరగాయలు, ఆకుకూరలను కూడా తీసుకునేందుకు వీలు ఏర్పడింది. అయితే అంతరిక్షంలో పూర్తి స్థాయిలో కూరగాయలను పండిస్తే.. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్ష మిషన్‌లలో వ్యోమగాములకు కావల్సిన తాజా ఆహారం సులభంగా లభిస్తుందని, దీంతో మరిన్ని మిషన్లను అవలీలగా చేపట్టవచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ఈ సైంటిస్టుల పరిశోధనకు చెందిన వివరాలను ఫ్రాంటియర్స్‌ ఇన్‌ ప్లాంట్‌ సైన్స్‌ అనే జర్నల్‌లోనూ ప్రచురించారు. logo