DGP Ravi Gupta | పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సోమవారం రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ ఎన్నిక జరుగనున్నది. ఈ నెల 13న రాష్ట్రవ్యాప్తంగా 35,809 కేంద్రాల్లో పోలింగ్ 106 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగుతుంది. 13 సమస్యాత్మక సెగ్మెంట్లలో సాయంత్రం 4 వరకు పోలింగ్ జరుగనున్నది. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులను నియమించినట్లు తెలిపారు.
ఎన్నికల విధుల్లో 500 తెలంగాణ స్పెషల్ విభాగం పోలీసులు పాల్గొంటారన్నారు. ఎన్నికలకు 164 కేంద్ర బృందాలతో బందోబస్తు ఉంటుందన్నారు. తమిళనాడు నుంచి మూడు స్పెషల్ ఆర్మ్డ్ బృందాలు, బందోబస్త్‌కు ఇతర రాష్ట్రాల నుంచి 7వేల మంది హోంగార్డులను మోహరించినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో 2,088 మంది మంది ఇతరశాఖల సిబ్బంది పాల్గొంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భద్రత, తనిఖీ నెట్వర్క్ ఏర్పాటు చేశామని.. నెట్‌వర్క్‌లో 482 ఫిక్స్డ్ స్టాటిక్ టీమ్‌లు, 462 స్టాటిక్ సర్వెలెన్స్ టీంలు మోహరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 89 అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులు, రాష్ట్రంలో 127 అంతర్ జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటులు, డీజీపీ కార్యాలయంలో కేంద్రీకృత కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులోకి వచ్చిందన్నారు.