యాదాద్రి, భువనగిరి : యాదాద్రి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు(Congress leaders) బీఆర్ఎస్(BRS) సొంతగూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకులు పంజాల మహేందర్, బోనోగ రవీందర్, యాట నరేష్, బీరయ్య , నర్సిరెడ్డి గారితో పది కుటుంబాలు శనివారం భువనగిరి పట్టణంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి (MLA Jagadish reddy), తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినెటి సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్యమయ్య గౌడ్, రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి , మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కోణతం యాకూబ్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు పొన్నబోయిన రమేష్, పట్టణ అధ్యక్షుడు జంగా శ్రీను,రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, మాజీ ఎంపీటీసీ విష్ణు, గ్రామ శాఖ అధ్యకుడు పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.