T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ కోసం నమీబియా సెలెక్టర్లు స్క్వాడ్‌ను ప్రకటించారు. గెరార్డ్ ఎరాస్మస్ (Gerald Erasmus) సారథిగా పదిహేను మందితో కూడిన బృందంలోని సభ్యుల పేర్లను శనివారం వెల్లడించారు. ఆల్‌రౌండర్లతో నమీబియా టీమ్ సమతూకంగా కనిపిస్తోంది. అయితే.. ఈ ఏడాది ఫాస్టెస్ట్ సెంచరీ (33 బంతుల్లో) బాదిన లొఫిటే ఈటన్ (Lofite Eaton)కు మాత్రం తుది స్క్వాడ్‌లో చోటు దక్కలేదు.
నమీబియా స్క్వాడ్ : గెర్హార్డ్ ఎరాస్మస్(కెప్టెన్), జనె గ్రీన్, మేఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచెర్, రుబెన్ ట్రుంప్లెమన్, జాక్ బ్రస్సెల్, బెన్ షికొంగో, తంగెని లుంగమెని, నికో డావిన్, జెజె. స్మిత్, జాన్ ఫ్రైలింక్, జేపీ కొట్జె, డేవిడ్ వీస్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మలన్ క్రుగెర్, పీబీ బ్లిగ్నట్.
వెస్టిండీస్, అమెరికాలు ఆతిథ్యమిస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 1న షురూ కానుంది. ఈ మెగా టోర్నీలో నమీబియా ‘గ్రూప్ -బి’లో ఉంది. అదే గ్రూప్‌లో రెండు సార్లు చాంపియన్ ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, స్కాంట్లాండ్, ఒమన్‌లు ఉన్నాయి. జూన్ 2న ఒమన్‌తో జరిగే మ్యాచ్‌తో వరల్డ్ కప్ సమరాన్ని నమీబియా ఆరంభించనుంది.