భువనేశ్వర్: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ విసిరారు. (Modi’s challenge to Naveen Patnaik) ఒడిశాలోని అన్ని జిల్లాలు, హెడ్క్వాటర్ల పేర్లు చెప్పాలని అన్నారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న బీజేడీ చీఫ్‌ను అవమానించేలా ఆయన మాట్లాడారు. ఒడిశాలోని కంధమాల్‌లో శనివారం జరిగిన ఎన్నికల సభలో మోదీ ప్రసంగించారు. ‘ఇంత కాలం ముఖ్యమంత్రిగా ఉన్న ‘నవీన్ బాబు’కు సవాల్ చేస్తున్నా. కాగితంపై చూడకుండా ఒడిశా జిల్లాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పమని నవీన్ బాబును అడగండి’ అని జనాన్ని ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలోని జిల్లాల పేర్లు సీఎం చెప్పలేకపోతే మీ బాధ ఆయనకు తెలుస్తుందా? అని మోదీ ప్రశ్నించారు. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఐదేళ్లలో ఒడిశాను నంబర్ వన్‌గా చేయకపోతే తనను నిలదీయాలని అన్నారు.
కాగా, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఐదుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) 2000 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో విజయాన్ని కొనసాగిస్తోంది. అయితే బీజేపీ మిత్రపక్షంగా ఉన్న బీజేడీ ఈసారి ఎన్నికల్లో కలిసి పోటీ చేయవచ్చన్న ఊహాగానాలు వినిపించాయి.
మరోవైపు ఒడిశాలో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐదుసార్లు సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్‌పై ప్రధాని మోదీ విషం కక్కుతున్నారు. కాగా, ఒడిశాలోని 21 లోక్‌సభ సీట్లు, 147 అసెంబ్లీ స్థానాలకు మే 13 నుంచి జూన్ 1 వరుకు నాలుగు దశల్లో పోలింగ్ జరుగనున్నది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.
#WATCH | While addressing a public meeting in Odisha's Kandhamal, PM Narendra Modi says, "…I want to challenge 'Naveen Babu' as he has been the CM for such long, ask 'Naveen Babu' to name the districts of Odisha and their respective capitals without seeing on a paper. If the CM… pic.twitter.com/om5whU39ho
— ANI (@ANI) May 11, 2024