e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, August 3, 2021
Home News మ‌హిళ‌ల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేలా హువావే బ్యాండ్ 6.. 96 ర‌కాల వ‌ర్క‌వుట్ మోడ్స్ కూడా..

మ‌హిళ‌ల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేలా హువావే బ్యాండ్ 6.. 96 ర‌కాల వ‌ర్క‌వుట్ మోడ్స్ కూడా..

మ‌హిళ‌ల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేలా హువావే బ్యాండ్ 6.. 96 ర‌కాల వ‌ర్క‌వుట్ మోడ్స్ కూడా..

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ పరికరాల దిగ్గజ సంస్థ హువావే ఇండియన్‌ మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్‌ బ్యాండ్‌ని ప్రవేశపెట్టింది. 96 ర‌కాల‌ వ‌ర్క‌వుట్ మోడ్స్‌తో పాటు హార్ట్ బీట్ సెన్సార్‌తో ఈ బ్యాండ్‌ని రూపొందించారు. అంతేకాకుండా మ‌హిళ‌ల ఆరోగ్యాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ట్రాక్ చేసేలా దీన్ని ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. దీని స్క్రీన్ సైజ్ కూడా గ‌త మోడ‌ళ్ల కంటే 148 శాతం పెద్ద‌దిగా ఉంటుంది. ఈ బాండ్ జూలై 12వ తేదీ నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుంది. అంబ‌ర్ స‌న్‌రైజ్‌, గ్రాఫైట్ బ్లాక్‌, ఫారెస్ట్ గ్రీన్‌, సాకురా పింక్ క‌ల‌ర్ల‌లో ల‌భ్య‌మ‌వుతాయి. దీన్ని కేవ‌లం 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు రెండు రోజుల వ‌ర‌కు ఉప‌యోగించ‌వ‌చ్చు. అదే బ్యాట‌రీ ఫుల్ చార్జింగ్ పెడితే 10 నుంచి 14 రోజుల వ‌ర‌కు వాడుకోవ‌చ్చు.

హువావే బ్యాండ్ 6 ఫీచ‌ర్లు

1.47 అంగుళాల అమోల్‌డ్ ఫుల్ వ్యూ క‌ల‌ర్ డిస్‌ప్లే (194×368 pixels), 64 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 282పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో ఈ హువావే బ్యాండ్ 6 వ‌స్తుంది. దీని ప‌ట్టీలు కూడా స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి. సిలికాన్‌తో ఈ ప‌ట్టీల‌ను రూపొందించ‌డం వ‌ల్ల తొంద‌ర‌గా దుమ్ము చేర‌దు. కాబ‌ట్టి ఎక్కువ కాలం చెడిపోకుండా ఉంటాయి.

- Advertisement -

కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న ఈ హువావే బ్యాండ్ 6లో హార్ట్ బీట్ సెన్సార్‌, స్లీప్‌ మానిటర్‌, ట్రూరిలాక్స్‌ ఒత్తిడి పర్యవేక్షణ సాంకేతికత, ఎస్పీ02 లెవల్‌ మానిటరింగ్‌తో పాటు ఆడవారి ఋతుచక్రాన్ని కూడా ట్రాక్‌ చేసే విధంగా ఇందులో ఫీచ‌ర్లు ఉన్నాయి. అలాగే స్విమ్మింగ్‌, రన్నింగ్‌, ట్రెడ్‌మిల్‌ మొదలగు 96 ర‌కాల‌ వర్కౌట్‌ మోడ్స్‌ ఉన్నాయి. సరికొత్త హువావే బాండ్‌ 6 బ్లూటూత్‌, నావిగేషన్‌తో పాటు 50 మీటర్ల లోతు నీటిలో కూడా ఇది ప‌నిచేస్తుంది. ఆండ్రాయిడ్ 6 లేదా అంత‌కంటే ఎక్కువ‌, ఐవోఎస్ 9 అంత‌కంటే ఎక్కువ వ‌ర్ష‌న్ ఉన్న ఫోన్ల‌కే ఈ బ్యాండ్ క‌నెక్ట్ అవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

గూగుల్‌లో వీటిని అస‌లు సెర్చ్ చేయ‌కూడ‌దు!

3జీ, 4జీ, 5జీ తెలుసు.. మ‌రి ‘జీరో’ జీ ఉంద‌ని తెలుసా !

Best smart phones Under 10000 | ప‌ది వేల లోపు స్మార్ట్‌ఫోన్ కొనాల‌నుకుంటున్నారా? ఈ మొబైల్స్‌ను ట్రై చేయండి

త్వరలో మార్కెట్ లోకి…వన్‌ప్లస్‌ నార్డ్‌-2

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మ‌హిళ‌ల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేలా హువావే బ్యాండ్ 6.. 96 ర‌కాల వ‌ర్క‌వుట్ మోడ్స్ కూడా..
మ‌హిళ‌ల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేలా హువావే బ్యాండ్ 6.. 96 ర‌కాల వ‌ర్క‌వుట్ మోడ్స్ కూడా..
మ‌హిళ‌ల ఆరోగ్యాన్ని ట్రాక్ చేసేలా హువావే బ్యాండ్ 6.. 96 ర‌కాల వ‌ర్క‌వుట్ మోడ్స్ కూడా..

ట్రెండింగ్‌

Advertisement