డబుల్ మాస్క్ ఎందుకు వాడాలి..?
ఒక మాస్క్ ధరించడం కన్నా డబుల్ మాస్క్ ధరించడం చాలా ఉత్తమమని వైద్యనిపుణులు సెలవిస్తున్నారు.

కొవిడ్-19 కి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మాస్క్‌లు ధరించడం, నిర్ణీత భౌతిక దూరం పాటించడం, చేతులను శానిటైజ్ చేసుకోవడం చాలా ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఒక మాస్క్ ధరించడం కన్నా డబుల్ మాస్క్ ధరించడం చాలా ఉత్తమమని వైద్యనిపుణులు సెలవిస్తున్నారు. ఈ విషయాలను అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) అధ్యయనంలో కూడా బయటపడ్డాయి.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాప్తి చెందుతుండటంతో రెండు మాస్కుల వాడకాన్ని ఆరోగ్య నిపుణులు ప్రోత్సహిస్తున్నారు, దీనిని “డబుల్ మాస్కింగ్” అని పిలుస్తారు. ఇది ప్రాణాంతక వ్యాధికి వ్యతిరేకంగా బలమైన అవరోధాన్ని సృష్టించగలదని వారు అంటున్నారు. డబుల్ మాస్కింగ్.. వస్త్రం, సర్జికల్ మాస్క్‌లతో గాలి లీకేజీని నివారించవచ్చు. అలాగే, ముఖం ఆకృతులను డబుల్ మాస్క్‌లు బాగా సరిపోతాయి.
డబుల్ మాస్కింగ్ కొవిడ్-19 కు గురికావడాన్ని దాదాపు 95 శాతం తగ్గించినట్లు యూఎస్ సీడీసీ తెలిపింది.
- ముఖం ఆకృతులకు డబుల్ మాస్కులు సరిపోతాయి.
- గాలి లీకేజీలను అరికడతాయి.
- చెవి చుట్టూ మెలేసి పెట్టకపోవడం వల్ల సర్జికల్ మాస్కుల ద్వారా 56.1 శాతం, మామూలు వస్త్రంతో తయారైన మాస్కుల ద్వారా 51.4 శాతం మాత్రమే వైరస్‌ను అడ్డుకుంటాయి.
- చెవి చుట్టూ మెలేసి గట్టిగా పెట్టుకోవడం ద్వారా గాలి లీకేజీని అరికట్టడం వల్ల 77 శాతం వైరస్‌ను అడ్డుకోవచ్చు.
- సర్జికల్ మాస్క్, సాధారణ మాస్క్ రెండింటిని కలిపి ధరించడం ద్వారా ఏకంగా 85.4 శాతం వైరస్‌ను అడ్డుకునే వీలుంటుంది.
చేయాల్సినవి… చేయకూడనివి..
బయటకు వెళ్లేప్పుడు ముఖానికి మాస్క్ సరిగా అమరింది లేనిదీ చూసుకోవాలి.
శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా పరిశీలించాలి.
మాట్లాడే మాట ఎదుటి వారికి స్పష్టంగా వినిపిస్తుందా చెక్ చేసుకోవాలి.
ఒకేసారి రెండు సర్జికల్ మాస్కులు వాడకూడదు.
ఎన్ 95 మాస్కును సాధారణ మాస్క్‌తో కలిపి వాడొద్దు.
మాస్కులపై ఇన్పెక్షన్ సోకకుండా వాడే ద్రావణాని చల్లకూడదు.
చినిగిపోయిన మాస్కులను అస్సలు వాడకూడదు.
ఇవి కూడా చదవండి..
కొవిడ్ సెకండ్ వేవ్ భిన్నం.. వచ్చే 4 వారాలు ఎందుకు కీలకమంటే..?
ఇద్దరు గూండాలకు పశ్చిమ బెంగాల్‌ను వదలను : మమతా బెనర్జీ
అమెరికా దౌత్యవేత్తలకు రష్యా దేశ బహిష్కరణ
సౌదీ ఎయిర్‌బేస్‌పై దాడి మా పనే: హైతీ తిరుగుబాటుదారులు
అంగారకుడిపై నాసా ఆక్సిజన్ ఉత్పత్తి
మొక్కల పెంపకంపై గూగుల్ డూడుల్
పాకిస్తాన్లో శాంతిని భారత్ కోరుకోవడం లేదు : పాక్ మంత్రి షేక్ రషీద్
రష్యా తురుపుముక్క లెనిన్.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

