DOOSRA : ప్రస్తుతం జీవితమంతా డిజిటల్ మయమైంది. వివిధ రకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. అదేవిధంగా వాటిని వినియోగించే క్రమంలో మనకు తెలియకుండానే మన నంబర్లు ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయి. వారు వాటిని వివిధ వాణిజ్య సంస్థలకు విక్రయిస్తున్నారు. ఫలితంగా పొద్దున లేచింది మొదలు అనేక రాంగ్ కాల్స్ ( Wrong Calls ) . పాలసీ తీసుకోండి, క్రెడిట్ తీసుకోండి ఇలా ఎన్నో. మరొకవైపు సైబర్ నేరగాళ్ల బెడద. ఫోన్లు చేయడం చాకచక్యంగా మాటల్లో పెట్టి వివరాలను తస్కరించడం పరిపాటిగా మారిపోయింది. ఎవరు? ఎందుకు ఫోన్ చేస్తున్నారో తెలియదు. ఇక మహిళల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆకతాయిల ఫోన్లు పెరిగిపోతున్నాయి. నిత్యం వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ సమస్యకు హైదరాబాద్‌కు చెందిన టెకీ ఆదిత్య వుచి పరిష్కారం చూపాడు. రాంగ్ కాల్స్, సైబర్ కేటుగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు అనుగుణంగా దూస్ర పేరిట యాప్‌ను రూపొందించాడు. ఈ యాప్ ద్వారా సిమ్ లేకుండానే ఫోన్ కాల్స్ అన్నింటినీ మేనేజ్ చేసుకునే వెసులుబాటు ఉండడం గమనార్హం.
అయితే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసి వినియోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రెండు విధాలా ఆఫర్లను యాప్ నిర్వాహకులు అందుబాటులో ఉంచారు. దూస్ర ఎసెన్షియల్ పేరిట ఒక ఆఫర్‌ను, దూస్ర ప్రో పేరిట రెండు ప్యాకేజీలను అందిస్తున్నారు. మొదటి ప్యాకేజీలో భాగంగా సంవత్సరానికి రూ.699, రెండవ ప్యాకేజీని పొందాలంటే రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. ఇక యాప్ నిర్వాహకులు కొవిడ్ వారియర్లు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సేవ చేస్తున్నవారికి ఆఫర్‌ను ప్రకటించాయి. అది కూడా 6 నెలల మాత్రమే.
యాప్‌ను ఇటీవల కాలంలోనే ఆవిష్కరించాం. ఇప్పటికే స్విగ్గీ, జొమాటో తదితర బహుళజాతి కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. యాప్‌నకు విశేష స్పందన లభిస్తుంది. యాప్ ద్వారానే మన ఫోన్‌కు సంబంధించిన అన్ని కాల్స్‌ను మేనేజ్ చేసుకోవచ్చు. అపరిచితుల ఫోన్ కాల్స్ బెడద నుంచి దూరంగా ఉండవచ్చు. ఇది మహిళల రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
– ఆదిత్య వుచి, సీఈవో, దూస్ర
మనం సాధారణంగా వివిధ రకాల యాప్‌లను వినియోగించే క్రమంలో, అదేవిధంగా కూపన్లను నింపేక్రమంలో, ప్రత్యేక పరిస్థితుల్లో మన వ్యక్తిగత ఫోన్ నంబర్లను వెల్లడించాల్సిన అవసరం ఏర్పడుతుంది. అయితే.. ఆ నంబర్లు అపరిచితులు, సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుండడమే అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. మనకు తెలియని నంబర్ల నుంచి ఫోన్లు రావడం నిత్యకృత్యమైంది. ఆ ఫోన్లను లిఫ్ట్ చేయకుండా ఉందామంటే ఎవరు చేస్తున్నారో తెలియదు? ఒకవేళ లిఫ్ట్ చేస్తే మరో సమస్య. ఇక అది అమ్మాయిలు అయితే మరిన్ని సమస్యలు. ఆ ఫోన్లు అక్కడితో ఆగవు. నిత్యం వేధింపులకు గురిచేస్తున్న సందర్భాలున్నాయి. వందల కొద్దీ సందేశాలు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు చెందిన టెకీ ఆదిత్య వుచి.. దూస్ర యాప్‌నకు రూపకల్పన చేశాడు. ప్రస్తుతం ఇది గుగూల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నది.
ఎవరైనా సరే మొదటగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. అనంతరం మన వివరాలను, వ్యక్తిగత ఫోన్ నంబర్లను అందులో నమోదు చేసుకోవాలి. అనంతరం మనకు వర్చువల్ బేస్డ్ 10 అంకెల నంబర్ అలాట్ అవుతుంది. ఆ నంబర్‌ను మనం ఫోన్ నంబర్‌లాగానే వినియోగించుకోవచ్చు. ఎవరికైనా ఇవ్వవచ్చు. ఇక ఇది ఎలా పనిచేస్తుంటే మన సిమ్ కార్డులో ఉన్న నంబర్స్ నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను మినహా మరే తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్స్‌ను ఇది అనుమతించదు. అవన్నీ దూస్ర యాప్ అలాట్ చేసిన నంబర్‌కు వాయిస్ మెసేజ్లుగా షిఫ్ట్ అవుతాయి. ఇక కాల్స్‌ను రిసీవ్ చేసుకోవడం, మేనేజ్ చేసుకోవడం అన్నింటినీ యాప్ ద్వారానే నిర్వహించుకోవచ్చు. సూటిగా చెప్పాలంటే మన వ్యక్తిగత నంబర్‌ను ఎక్కడా ఎవరికీ ఇవ్వకుండా అన్నింటికీ దూస్ర యాప్ అలాట్ చేసిన నంబర్‌నే ఇచ్చి వినియోగించుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
మార్స్‌పైకి మనుషులను పంపనున్న చైనా.. ఎప్పుడంటే?
భూమి ఎలా ఏర్పడింది.. అస్సాంలో పడిన ఉల్కలో దాగి ఉన్న రహస్యం
మన సౌర కుటుంబంలోకి దూసుకొచ్చిన భారీ తోకచుక్క.. ఎంత పెద్దదంటే?
టెస్లా ఏఐ చిప్ : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది