టెస్లా ఏఐ చిప్ : ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది…

ముంబై, జూన్ 25: గ్లోబల్ ఎలక్ట్రానిక్ అండ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ ఉత్పత్తుల సరఫరా విషయంలో అంతరాయం కలుగుతున్నది. ఇది తయారీ సంస్థలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ప్రాసెసర్ చిప్‌ల కొరత వల్ల ఈ సరఫరాకు అంతరాయం కలుగుతున్నది. పరిమాణంలో నాణెం కంటే చాలా చిన్నదిగా ఉన్నా, మొబైల్ , వీడియో గేమ్స్ నుంచి అంతరిక్ష రాకెట్లు , విమానాలు వంటి అతిపెద్ద యంత్రాలకు కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఆటోమోటివ్ పరిశ్రమ తయారీ సంస్థలు తమ ఎలక్ట్రిక్ ఉత్పత్తులు ,కార్ల తయారీలో ఈ చిప్‌లను వినియోగిస్తున్నాయి. అందుకోసం మిలియన్ల కొద్దీ పెట్టుబడులు పెడుతున్నాయి.

ఫైటర్ జెట్ F-35 Lightning-II కంటే…
ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా. వందేండ్ల నుంచి ఉన్న ప్రపంచ అత్యంత శక్తివంతమైన ఆటో కంపెనీలలు సైతం మైక్రోచిప్‌లపై ఆధారపడుతున్నాయి. ఈ చిప్ లకు యంత్రాల కంటే ఎక్కువ శక్తి ఉంటుంది. టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మైక్రోప్రాసెసర్ పై సెలెక్ట్ కార్ లీజింగ్ సంస్థ అధ్యయనం చేసింది. దీని ప్రకారం మనుషులను చంద్రుడు మీదకు తీసుకెళ్లిన అపోలో 11 రాకెట్ కంటే శక్తివంతమైనదని తేలింది. లాక్‌హీడ్ మార్టిన్ రూపొందించిన ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్ F-35 Lightning-II కంటే చాలా పవర్ ఫుల్ చిప్ అని సెలెక్ట్ కార్ లీజింగ్ సంస్థ తెలిపింది.
ఇటీవల టెస్లా అభివృద్ధి చేసిన చిప్ సెకనుకు 36 ట్రిలియన్ ఆపరేషన్లు చేయగలదు. దీనిని రెండు ‘న్యూరల్ నెట్వర్క్ శ్రేణులతో’ రూపొందించారు. కెమెరా,సెన్సార్,రాడార్,జిపిఎస్ డేటాను ప్రాసెస్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. టెస్లా ఆటోమేటెడ్ డ్రైవింగ్ ఫంక్షన్లకు ఇది చాలాబాగా ఉపయోగపడుతుంది. చట్టపరంగా అనుమతించినతర్వాత సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను కూడా తయారు చేయగలదని ఈ స్టడీలో వెల్లడైంది. ప్రపంచ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్‌ను ఓడించిన ఐబిఎం డీప్ బ్లూ సూపర్ కంప్యూటర్ 200 మిలియన్ల వెనుకబడి ఉంది. అగ్రస్థానంలో ఉన్న ఏకైక ‘కంప్యూటర్’ మానవ మెదడు అని సెలెక్ట్ కార్ లీజింగ్ సంస్థ తమ పరిశోధన ద్వారా వెల్లడించింది.

టెస్లా న్యూ చిప్ ఎంత పవర్ ఫుల్ అంటే…?
మానవ మెదడు సెకనుకు 1క్వాడ్రిలియన్ ఆపరేషన్స్ చేయగలదు.టెస్లా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ మైక్రో చిప్ సెకనుకు 72 ట్రిలియన్ల ఆపరేషన్లు చేయగలదు. అపోలో మాక్ ప్రో సెకనుకు 56ట్రిలియన్ల ఆపరేషన్లు చేయనున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

