e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home Top Slides 25వేలలోపు టాప్-5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

25వేలలోపు టాప్-5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

25వేలలోపు టాప్-5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? స్నాప్‌డ్రాగన్‌ ప్రాసెసర్‌, ప్రీమియం డిజైన్స్‌, అద్భుతమైన పనితీరు, డ్యూయల్‌ కెమెరాలు, 4జీతో పాటు 5జీ కనెక్టివిటీ కలిగిన ఫోన్లను ప్రముఖ కంపెనీలు శాంసంగ్‌, ఒప్పో, షియోమీ, వివో, రియల్‌మీ మార్కెట్లోకి ఆవిష్కరించాయి.భారత్‌లో 25వేల లోపు అందుబాటులో ఉత్తమ స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేద్దాం!

రియల్‌మీ X7 5G ధర రూ. 19,999

రియల్‌మీ ఎక్స్‌7 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 6జీబీ ర్యామ్‌+128జీబీ స్టోరేజ్‌ కలిగిన మోడల్‌ ధర రూ.19,999గా ఉంది. హైయ్యర్‌ ఎండ్‌ 8GB ర్యామ్‌ +128GB స్టోరేజ్‌ వేరియంట్‌ధర రూ.21,999గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ నెబులా, స్పేస్‌ సిల్వర్‌ కలర్లలో అందుబాటులో ఉంది.

శాంసంగ్‌ గెలాక్సీ F62


సౌత్‌కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ గెలాక్సీ ఎఫ్‌62 మోడల్‌ ధర రూ.23,999గా ఉంది. 6.7 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ ప్లస్‌ డిస్‌ప్లే ,క్వాడ్‌ కెమెరా, 64ఎంపీ ప్రైమరీ కెమెరా, 6000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

వివో V20

వివో వీ20(2021) ఫోన్‌లో వాటర్‌డ్రాప్‌ నాచ్‌, 60హెర్ట్జ్‌ రిఫ్రెష్‌రేట్‌తో 6.44 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. 8జీబీ ర్యామ్‌, 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.24,990గా ఉంది.

మోటోరోలా మోటో జీ 5జీ


మోటోరోలో కంపెనీ మోటో జీ 5జీ ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల మాక్స్‌ విజన్‌ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌తో వస్తుంది. 6జీబీ ర్యామ్‌+ 128జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.20,999గా ఉంది.

రియల్‌మీ నార్జో 30 ప్రొ 5జీ

రియల్‌మీ నార్జో 30 ప్రొ 5జీ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ .16,999గా నిర్ణయించారు. హై-ఎండ్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ .19,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ బ్లేడ్ సిల్వర్, స్వోర్డ్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
25వేలలోపు టాప్-5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే!

ట్రెండింగ్‌

Advertisement