e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home జిల్లాలు మేళాసంఘం మురిసె..

మేళాసంఘం మురిసె..

మేళాసంఘం మురిసె..

పల్లెప్రగతితో అభివృద్ధి కేరాఫ్‌గా మారిన ్రగ్రామం
పార్కులను తలపిస్తున్న పల్లెప్రకృతి వనం
వందశాతం మరుగుదొడ్ల నిర్మాణం
మురుగు కాల్వల నిర్మాణంతో తీరిన చింత

మునిపల్లి, జూన్‌ 13: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయి. అం దోల్‌ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ సహకారంతో సర్పంచ్‌ కొమ్మగొళ్ల శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి నిధులతో మేళాసంగం అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. పార్కులను తలపించేలా పల్లె ప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు నిర్మాణాలు పూర్తయ్యాయి. గ్రామంలోకి వెళ్లగానే హరితహారం మొక్కలు స్వాగతం పలుకుతాయి. గ్రామం లో ఎటుచూసినా పరిసరాల పరిశుభ్రత, మౌలిక వసతులతో ఆదర్శంగా కనిపిస్తున్నది. గ్రామంలో 490 కుటుంబాలు ఉండగా, 1,470 మంది జనా భా నివసిస్తున్నారు. ఇంటింటికీ మరుగుదొడ్లు, గల్లీగల్లీకి సీసీ రోడ్లు, మురుగు కాల్వల నిర్మాణం చేపట్టడంతో గ్రామంతా అందంగా కనిపిస్తున్నది. గ్రామ శివారులో నిర్మించిన డంపింగ్‌యార్డును గ్రామస్తులు చక్కగా వినియోగించుకుంటున్నారు. పంచాయతీ పాలకవర్గంతో పాటు యువజన సంఘాల సభ్యులు సమష్టి కృషితో గ్రామ అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. నిత్యం పారిశుధ్య పనులు, మౌలిక వసతులు కల్పించడంతో వందశాతం ఇంటి పన్ను వసూలు చేస్తున్నారు. గ్రామంలో దాదాపు 5 వేల మొక్కలు నాటారు. గ్రామంలో ఎటు చూసినా పచ్చదనంతో కనిపిస్తున్నది.
చేపట్టిన అభివృద్ధి పనులు…
మునుపెన్నడూ లేనివిధంగా మేళాసంగం అన్నిరంగాల్లో అభివృద్ధిలో పరుగులు పెడుతూ పక్క గ్రామాలతో పోటీపడుతున్నది. పల్లె ప్రగతి కార్యక్రమంలో గ్రామం మరింత అభివృద్ధి చెందుతున్నది. గ్రామంలో దాదాపు రూ.50 లక్షలతో పలు అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. యువకుల సహకారంతో గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశారు. గ్రామాన్ని ఆదర్శంగా తయారు చేసేందుకు గ్రామస్తులందరూ సహకరిస్తున్నారు.
గ్రామంలో ఎప్పుడూ లేని అభివృద్ధి
పల్లెప్రగతి కార్యక్రమంలో మా గ్రామం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందింది. గతంలో ఎప్పుడూ జరుగని అభివృద్ధి పనులు జరిగాయి. టీఆర్‌ఎస్‌ హయాంలో గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నాం. గ్రామంలో మురుగు కాల్వ లు నిర్మించాం. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
శ్రీనివాస్‌-సర్పంచ్‌, మేళాసంగం
అందరి సహకారంతో..

గ్రామస్తుల సహకారంతో గ్రామంలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరిగింది. ప్రతిఒక్కరూ ఇంటి పన్ను చెల్లిస్తూ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. అభివృద్ధిలో గ్రామస్తుల సహకారం బాగుంది. ఆదర్శ గ్రామంగా తయారు చేసేందుకు ప్రతిఒక్కరూ సహకరిస్తున్నారు. పల్లెప్రగతి కార్యక్రమంలో మేళాసంగంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి.
వాణి, పంచాయతీ కార్యదర్శి, మేళాసంగం

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మేళాసంఘం మురిసె..
మేళాసంఘం మురిసె..
మేళాసంఘం మురిసె..

ట్రెండింగ్‌

Advertisement