మంగళవారం 27 అక్టోబర్ 2020
Sangareddy - Sep 28, 2020 , 00:49:50

చెరువులను కాపాడుకోవాలి

చెరువులను కాపాడుకోవాలి

 బడంగ్‌పేట/పహాడీషరీఫ్‌ : భవిష్యత్‌ తరాల కోసం చెరువులను కాపాడు కోవాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కార్పొరేషన్‌ పరిధిలోని బురాన్‌ ఖాన్‌ చెరువు, ఉస్మాన్‌ నగర్‌, జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 74 ఎకరాలు ఉన్న బురాన్‌ ఖాన్‌ చెరువు ప్రస్తుతం 20 ఎకరాలు మాత్రమే ఉందన్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టడం ద్వారా ముంపు సమస్యకు కారణమవుతుందన్నారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో పేద, మధ్య తరగతి ప్రజలు ఇండ్లు కట్టుకున్నారన్నారు. గతంలో 250 మందికి పట్టాలు ఇచ్చామన్నారు. ఆ పట్టాలు అమ్ముకొని ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు చేసుకున్నారన్నారు.  ఖాళీ చేయక పోతే భవిష్యత్‌లో  ఇబ్బందులు తప్పవన్నారు.  వర్షాలు తగ్గు ముఖం అయిన వెంటనే జల్‌పల్లి మున్సిపల్‌, బడంగ్‌పేట కార్పొరేషన్‌ లో ప్రణాళిక  బద్ధంగా పనులు చేపడుతామన్నారు. మున్సిపల్‌ అభివృద్ధికి  నిధులు కేటాయిస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని తెలిపారు. జల్‌పల్లి మున్సిపల్‌  చైర్మన్‌ అబ్దుల్లా సాది, వైస్‌ చైర్మన్‌ ఫరానా, తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు యాదగిరి, మజురలీ,  సుదర్శన్‌ పాల్గొన్నారు. 

ముంపు ప్రాంతాల్లో పర్యటన..

  ఆర్కేపురం :  సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు.  ముంపునకు గురైన ఆర్కేపురం డివిజన్‌ పరిధిలోని హరిపురి కాలనీ, జనప్రియ గార్డెన్స్‌, యాదవనగర్‌, ఎన్టీఆర్‌నగర్‌ కాలనీ ఫేస్‌-1, ఫేస్‌-2, బంజారాకాలనీ, జూనియర్‌ ఎన్టీఆర్‌నగర్‌లో  అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎల్బీనగర్‌ నుంచి ఎన్టీఆర్‌నగర్‌ మీదుగా నీరు కిందికి వెళ్తుందని వరద ప్రభావం ఎక్కవగా ఉందన్నారు. డ్రైనేజీ పైపులైన్‌ సామర్థ్యం పెంచేలా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సరూర్‌నగర్‌ తహసీల్దార్‌ రామ్మోహన్‌, సరూర్‌నగర్‌ సర్కిల్‌ డీసీ హరికృష్ణయ్య, డివిజన్‌ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్‌శర్మ, ప్రధాన కార్యదర్శి పెండ్యాల గణేశ్‌, ఖిల్లా మైసమ్మ దేవాలయ చైర్మన్‌ గొడుగు శ్రీనివాస్‌, నాయకులు మారోజు రామాచారి, ఎస్‌.కె.మహ్మద్‌, కొండ్ర శ్రీనివాస్‌, సాజీద్‌, ఎన్‌.శ్రీనివాస్‌రెడ్డి, రాజుశ్రీవాస్తవ, యాదవరెడ్డి, పగిళ్ల భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

logo