మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sangareddy - Sep 16, 2020 , 03:10:58

ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు

ఇంటింటికీ ప్రభుత్వ పథకాలు

  • నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి 

చేగుంట: రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయని చేగుంట మండల ఇన్‌చార్జి నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కుంటు పడకుండా మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తెలుసుకున్నారు. మంగళవారం మండలంలోని కొండాపూర్‌లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి తన పర్యటను ప్రారభించారు. బీ కొండాపూర్‌, బోనాల్‌, పులిమామిడి, కిష్టాపూర్‌ గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డికి గ్రామ ప్రజలు  స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతి నిత్యం ప్రజలతో ఉండే దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతి నియోజకవర్గ ప్రజలకు తీరని లోటు ప్రజల సమస్యలను తీర్చే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, కొత్త ఎమ్మెల్యే వచ్చే వరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సహకారంతో మండలంలోని ప్రజల సమస్యలను పరిష్కారించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటే   రకరకాల పార్టీల నాయకులు వచ్చి మాయమాటలు చెప్పే అవకాశం ఉంది. వారి ప్రలోభాలకు గురికాకుండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని   గెలిపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ చంద్రాగౌడ్‌ ,టీఆర్‌ఎస్‌ మండలపార్టీ అధ్యక్షుడు తాడెం వెంగళ్‌రావు,ఎంపీపీ  శ్రీనివాస్‌, జడ్పీటీసీ శ్రీనివాస్‌, మార్కెట్‌కమిటీ చైర్మన్‌ రజనక్‌ ప్రవీన్‌కుమార్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, వివిధగ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


logo